Free Blue Tick : ‘ఎక్స్‌’లో మళ్లీ బ్లూటిక్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి !

Free Blue Tick : ట్విట్టర్(ఎక్స్)లో బ్లూ టిక్ మళ్లీ ఫ్రీ అయ్యింది. ఔను.. మీరు చదివింది నిజమే!! 

  • Written By:
  • Updated On - April 6, 2024 / 08:17 AM IST

Free Blue Tick : ట్విట్టర్(ఎక్స్)లో బ్లూ టిక్ మళ్లీ ఫ్రీ అయ్యింది. ఔను.. మీరు చదివింది నిజమే!!  అయితే ఈ గుడ్ న్యూస్ కొంతమందికే పరిమితం. ఎవరికి అంటే.. 2500 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన ఎక్స్​ యూజర్లకు!! వీరికి ఫ్రీగా బ్లూ టిక్ లభించనుంది. ఉచితంగా బ్లూటిక్‌తో పాటు పలు ప్రీమియం ఫీచర్లను కూడా ఇకపై అందించనున్నారు. 2022 సంవత్సరంలో ట్విట్టర్​ను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రూ.3 లక్షల కోట్లకు కొనేశాడు. ఆ తర్వాత ట్విట్టర్ వ్యాపార వ్యూహంలో ఆయన చాలా మార్పులు చేశారు. చివరకు పేరును కూడా ఎక్స్‌గా మార్చేశారు. బ్లూటిక్ కావాలంటే ప్రతినెలా రూ.666 కట్టాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే ఈవిధంగా పేమెంట్ చేసి కొనేందుకు అంతగా నెటిజన్లు మొగ్గుచూపడం లేదు. దీంతో కనీసం 2500 మందికిపైగా ఫాలోవర్లను కలిగిన వారికి ఫ్రీగా బ్లూ టిక్​​లను(Free Blue Tick) ఇచ్చేయాలని తాజాగా డిసైడయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

ఏమిటీ బ్లూ టిక్  ?

  • గతంలోనూ ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన వారికి ట్విటర్​ వెరిఫికేషన్ బ్యాడ్జ్​ కింద బ్లూ టిక్​లను ఫ్రీగా ఇచ్చేది. దీంతో గతంలో సెలబ్రిటీలు, ఇన్​ప్లూయెన్సర్స్​లు, పొలిటీషియన్ల అకౌంట్లకే బ్లూటిక్​ మార్కులు ఉండేవి. ఫలితంగా యూజర్లు నిజమైన అకౌంట్లను మాత్రమే ఫాలో కావడానికి వీలయ్యేది.
  •  2022 సంవత్సరం నుంచి  బ్లూటిక్‌కు నెలవారీ ఛార్జీగా రూ.666 పెట్టడంతో..  సెలబ్రిటీల, హై ప్రొఫైల్​ అకౌంట్లకు ఉన్న బ్లూటిక్​లు పోయాయి. చాలామంది వీఐపీలు, సెలబ్రిటీలు కూడా నెలవారీగా డబ్బులు పెట్టి బ్లూటిక్ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.
  • అయితే ఇదే అదునుగా ఫేక్​ ఎక్స్ (ట్విట్టర్)​ అకౌంట్లు  పుట్టుకొచ్చాయి. ఇలా  ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్లు డబ్బులిచ్చి బ్లూ టిక్‌లను కొనేశారు.
  • ఈ పరిణామంతో అసలు, నకిలీ ఎక్స్ అకౌంట్ల మధ్య తేడాను యూజర్లు గుర్తించలేక తికమకపడ్డారు.

Also Read :Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌‌కు ఇల్లు.. అద్దె తెలిస్తే షాకవుతారు!

  •  ఎక్స్‌లో ఈవిధంగా పరిస్థితులు చేయి దాటుతుండటంతో కనీసం వీఐపీలు, సెలిబ్రిటీల అకౌంట్లకు బ్లూటిక్‌ను ఫ్రీగా ఇచ్చే దిశగా ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు.
  • అందుకే 2500 మందికంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు ఉచితంగా బ్లూ టిక్ అందిస్తామని ప్రకటించారు.
  • 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు పూర్తి ఉచితంగా ప్రీమియం ప్లస్ ఫెసిలిటీస్ కల్పిస్తామని గతవారమే ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశారు.

Also Read :Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్