Electric Plane: ఎలక్ట్రిక్ విమానం కూడా వచ్చేస్తోంది..!

ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ తగ్గి ఇప్పుడు ఎలక్ట్రిక్ హవా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ బైక్స్, కార్స్ కు మాత్రమే కాదు. విమానాలకు కూడా అప్లై చేస్తోంది నాసా. ఈక్రమంలో ఈ ఏడాదే నాసా విద్యుత్‌ విమానం (Electric Plane) వచ్చేస్తోంది. దీనికి " ఎక్స్‌–57" అని పేరు పెట్టారు.

  • Written By:
  • Updated On - February 4, 2023 / 10:39 AM IST

ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ తగ్గి ఇప్పుడు ఎలక్ట్రిక్ హవా నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ బైక్స్, కార్స్ కు మాత్రమే కాదు. విమానాలకు కూడా అప్లై చేస్తోంది నాసా. ఈక్రమంలో ఈ ఏడాదే నాసా విద్యుత్‌ విమానం (Electric Plane) వచ్చేస్తోంది. దీనికి ” ఎక్స్‌–57″ అని పేరు పెట్టారు. దీనికి 14 ప్రొపెల్లర్లను అమర్చారు. ఇటలీ తయారీ ” టెక్నామ్‌ పీ2006టీ” అనే 4 సీట్ల విమానానికి ఆధునికతను జోడించి లిథియం అయాన్‌ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్‌ ఏరోప్లేన్‌ను నాసా సిద్ధంచేస్తోంది. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో.. ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయికతో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్‌లో అమర్చడం విశేషం.

ఈ ఎలక్ట్రిక్ విమానం  ప్రయాణ సమయంలో ప్రొపెల్లర్‌తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో దాని ప్రయాణ వేగం తగ్గే ప్రసక్తే ఉండదు. కొత్త డిజైన్‌ ప్రొపెల్లర్ల వినియోగం కారణంగా శబ్దకాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది.ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్‌ చేయడం విశేషం. ప్రొపెల్లర్ల నుంచి పుట్టే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్‌వేలతో పనిలేదు. కొంచెం దూరం రన్ వే పై దూసుకెళ్ల గానే ఈ ఎలక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగరగలదు.

తొలి విడతగా 200 కిలోమీటర్లలోపు.. గంటలోపు వ్యవధి కలిగిన స్వల్ప ప్రయాణాల కేటగిరీలో ఎలక్ట్రిక్ విమానాలను ప్రవేశపెట్టాలని నాసా యోచిస్తోంది. అయితే ఈ చిన్నపాటి ఎలక్ట్రిక్ విమానం తయారీలో అమెరికాకే చెందిన జోబీ ఏవియేషన్​ కూడా నాసాతో కలిసి పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ‘ఈజీ జెట్’ అనే కంపెనీ కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి లండన్– ఆమ్‌స్టర్‌డ్యామ్ రూట్ లో ఎలక్ట్రిక్ విమానాలు నడుపుతామని గతంలోనే వెల్లడించింది.

మీకు ‘ఆలిస్’ తెలుసా..?

ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరున్న ‘ఆలిస్’ అనే విమానం 2022 సెప్టెంబర్ లో విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆలిస్‌ (Alice) అని పేరు పెట్టారు. దీన్ని ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ (Eviation Aircraft) అనే కంపెనీ తయారు చేసింది. 6 నెలల క్రితం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MWH) లో ఆలిస్‌ తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉదయం 7:10 గంటలకు బయలుదేరిన ఫ్లైట్ 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు ప్రయాణించింది.

ఆలిస్ విమానం కూడా జీరో ఎమిషన్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. లైట్ జెట్‌లు, హై-ఎండ్ టర్బోప్రోప్స్‌తో పోలిస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. 9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో అనే మూడు వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ప్యాసింజర్ వెర్షన్‌కు గరిష్టంగా 1,134 కిలోల లోడ్ కెపాసిటీ, ఈకార్గో వెర్షన్‌కు 1,179 కిలోల కెపాసిటీ ఉంది. ఆలిస్‌ గరిష్టంగా 260 నాట్ల ఆపరేటింగ్ స్పీడ్‌తో ట్రావెల్‌ చేస్తుంది. అన్ని వేరియంట్లలో ఇద్దరు సిబ్బంది ప్రయాణించే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో వేరియంట్స్‌లో లోపలి భాగం మినహా మిగతా అన్నీ కమ్యూటర్‌ కాన్ఫిగరేషన్‌కు సమానంగా ఉంటాయి.