Elon Musk: తిక్క కుదిరింది. ఉద్యోగులను తొలగించి తప్పు చేశానంటూ ట్వీట్.. ప్లీజ్ మళ్లీ చేరండంటూ అభ్యర్థన.!!

  • Written By:
  • Updated On - November 16, 2022 / 12:01 PM IST

ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్…ఈ మధ్య ఆయన గురించే ట్రెండింగ్. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడో లేదో ఉద్యోగులకు ఉద్వాసన పలికాడు. బ్లూటిక్ అంటూ నానా రచ్చ చేశాడు. సబ్ స్క్రిప్షన్ల పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చాడు. మస్క్ దెబ్బకు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆదాయం లేదని ఖర్చులు తగ్గించుకోవడానికే ఇలా చేస్తున్నా అంటూ ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు మస్క్. అంతేకాదు 24 గంటల పనిచేస్తున్నా… ఎప్పుడు ఇంటికి వెళ్తానో కూడా తెలియడం లేదంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు.

ఇప్పుడు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నాడు. కంపెనీలో నుంచి తొలగించిన ఉద్యోగులను మళ్లీ రమ్మంటున్నాడు. దయచేసి తిరిగి రండి అంటూ అభ్యర్థించాడు. దీంతో ఉద్యోగులను వెనక్కి పిలిచే ప్రక్రియ మొదలైంది. ఇది తాను చేసిన అతిపెద్ద తప్పు అని గ్రహించాడు. ట్విట్టర్ లో ఎలన్ మస్క్ ఆపరేషన్ క్లీన్ ట్విట్ చేయడం ద్వారా మస్క్ తప్పును అంగీకరించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ బాసే చెప్పారు. తన తప్పును గ్రహించిన ఎలో న్ మస్క్ తాజా ట్వీట్ లో నేను నా తప్పును అంగీకరంచడం చాలా ముఖ్యం. ఉద్యోగులను తొలగించి పెద్ద తప్పు చేశాను అంటూ ట్వీట్ చేశాడు.

 

 

తన తప్పును అంగీకరిస్తూ..తిరిగి వచ్చిన ఇద్దరు ఉద్యోగులతో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. మొత్తానికి ట్విట్టర్ బాస్ తిక్కకుదిరిందని నెటిజన్లు అంటున్నారు. అనవసరంగా ఉద్యోగులకు తొలగించి ఎలాంటి తప్పు చేశారన్నది ఇప్పటికైనా అర్థమైంది అంటున్నారు.