Site icon HashtagU Telugu

Inbuilt Earbugs: ఇకపై ఫోన్ లోనే ఇయర్ బడ్స్.. అదెలా సాధ్యమంటే?

3bf5ae04 418a 4145 826d 323e5fb06f40

3bf5ae04 418a 4145 826d 323e5fb06f40

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది దగ్గర వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో ఫోన్లో మాట్లాడడంతో పాటుగా పాటలు వినడం,వీడియోలు చూడడం,గేమ్స్ ఆడటం లాంటి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇయర్ బడ్స్ కొన్న వారికి వాటిని పెట్టుకోవడానికి కేస్ ను తీసుకెళ్ళడం ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఇయర్ బడ్స్ చార్జింగ్ కోసం అవి కీలకం.

అయితే కొన్ని కొన్ని సార్లు మన అజాగ్రత్త వల్ల ఇయర్ బడ్స్ పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయిన వాటిని వెతుక్కోవడం కూడా పెద్ద సమస్య. ఈ క్రమంలోనే యూల్ ఫోన్ సంస్థ సరికొత్తగా మొబైల్ లోనే భాగంగా వైర్లెస్ ఇయర్ బడ్స్ తో సరికొత్త మోడల్ ఆర్మర్ 15 ను తీసుకువచ్చింది. కిక్ స్టార్టర్ వెబ్ సైట్ ఆవిష్కరించింది. యూల్ ఫోన్ ఆర్మర్ 15 ఫోన్ కు పై భాగంలో రెండు వైర్ లెస్ ఇయర్ బడ్స్ తో కూడిన కేస్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. వాటికి పైన మూతలు కూడా ఉంటాయి. మనకు కావాలి అనుకున్నప్పుడు వాటిని మనం బయటకు తీసుకుని వాడుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ లోనే పెట్టవచ్చు. అయితే ఇయర్ బడ్స్ కు ఛార్జింగ్ కూడా అందులోనే అవుతుందని యూల్ ఫోన్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ ను ఇతర ఫోన్లో గాడ్జెట్ లకు కూడా అనుసంధానం చేసుకోవచ్చు అని తెలిపింది.

D51897d8 2d8a 4194 876d 9da4ec38824e

ఈ ఫోన్ లోని ప్రత్యేకతల విషయానికి వస్తే..యూల్ ఫోన్ ఆర్మర్ 15 ఫోన్ లో 5.45 అంగుళాల హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో, 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీతో లభిస్తుంది.ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో పొందుపరిచి నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో ఏకంగా 6,600 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ లో వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.ఆర్మర్ 15 ఫోన్ ధర రూ.13,500 రూపాయలు.