Moto X30 Pro: మొట్టమొదటి 200 మెగా ఫిక్సెల్ ఫోన్.. మోటో ఎక్స్ 30 ప్రో ప్రత్యేకతలు ఇవే?

ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు నిత్యం విడుదలవుతున్నాయి

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 07:45 AM IST

ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు నిత్యం విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మార్కెట్లోకి రానటువంటి అత్యధిక ఫీచర్లు కలిగినటువంటి మోటో ఎక్స్ 30 ప్రో మొబైల్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కానుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ మొట్టమొదటి 200 మెగా పిక్సెల్ ఫోన్ అని చెప్పాలి. ఇలాంటి అధునాతనమైన ఫీచర్లు కలిగినటువంటి ఈ మొబైల్ ఫోను ఆగస్టు రెండవ తేదీ చైనాలో లాంచ్ కానుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మొదటిసారిగా 200 మెగా ఫిక్సల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ఆగస్టు రెండవ తేదీ చైనాలో మార్కెట్లోకి విడుదల కానున్న మోటో ఎక్స్ 30 ప్రో మొబైల్ ఫోన్ 6.67 అంగుళాలు కలిగి ఉంది. భారీ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉండనుంది. దీనికి హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో 200 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 50,12 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే 80, 55, 35 ఎంఎం లెన్స్, సెన్సర్ల సాయంతో క్లోజప్, పోర్ట్రయిట్, వైడ్ యాంగిల్ ఫొటోలు తీసుకునే సదుపాయం ఉండనుంది. ఇక ఫ్రంట్ కెమెరా 60 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. అరగంటలోనే 100% బ్యాటరీ ఫుల్ అవుతుంది. వైర్లెస్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఫ్రంట్ బ్యాక్ కాకుండా వాల్యూమ్ బటన్ లో కూడా అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది ఈ మొబైల్ ధర రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా అయితే ఈ మొబైల్ లాంచ్ చేసే రోజు సరైన ధర తెలియజేయనున్నారు. దీనితో పాటు 8 జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీతో మరొక మోడల్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.