Site icon HashtagU Telugu

WORDLE : గేమ్ ఎలా ఆడాలో తెలుసా..? ఎందుకంత ట్రెండ్ అవుతోంది…?

Wordle

Wordle

వర్డ్ ల్ గేడ్ గేమ్ గురించి మీకు తెలుసా…? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాళ్లకు ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గేమ్ గురించే చర్చ జరుగుతుంది. అసలు ఈ గేమ్ కు అంత క్రేజ్ ఎందుకు. ఈ గేమ్ ను ఎలా ఆడుతారు…ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గేమ్ ఆడటం చాలా ఈజీ. ఇంగ్లీష్ వర్డ్ ను గెస్ చేసే ఆట. ప్రతిరోజు కొత్త కొత్త పదం ఉంటుంది. ఐదు లెటర్స్ ఉంటాయి. ఆరు అవకాశాలు ఉంటాయి. ఈ ఆట కోసం ఒక వెబ్ సైట్ కూడా ఉంటుంది. దీని కోసం ఇప్పటివరకు యాప్ ను క్రియేట్ చేయలేదు. https://www.powerlangauge.co.uk/wordle/ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ గేమ్ ను ఆడాలి. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే ఒక గ్రిడ్ కనిపిస్తుంది. మొదటి వరుసలో ఐదు లెటర్ల పదాన్ని గెస్ చేయాలి. ఆ వర్డ్ కోసం ఎలాంటి క్లూస్ ఉండవు. రాండమ్ గా పదాన్ని గెస్ చేసి ఆ గ్రిడ్ లో టైప్ చేయాలి. ఒకవేశ మీరు గెస్ చేసిన పదంలో ఉన్నలెటర్స్ ఒరిజినల్ పదంలో ఉన్న లెటర్స్ సరిపోయినట్లయితే…సేమ్ పొజిషన్లో ఉంటే ఆ లెటర్స్ గ్రీన కలర్ లో చూపిస్తుంది. లేదంటే లెటర్స్ ఒరిజినల్ పదంలో ఉండి…సేమ్ పొజిషన్ కానట్లయితే ఎల్లో కలర్ లో హైలైట్ అవుతుంది. ఒకవేళ ఆ లెటర్స్ ఆ పదంలో లేనట్లయితే గ్రే కలర్ లో హైలైట్ అవుతుంది.

గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో హైలేట్ అయ్యే పదాలే క్లూ. వాటి ఆధారంగానే అసలైన పదం ఏదో ఊహించాల్సి ఉంటుంది. ఎక్కువ రిపీటెడ్ లెటర్స్ ఉన్న పదం కాకుండా…రిపీట్ కాని లెటర్స్ ఓవెల్స్ ఎక్కువగా ఉన్న పదంతో గెస్ చేసినట్లయితే..అసలైన పదం ఏంటో ఈజీగా చెప్పొచ్చు.

ఇక ఈ గేమ్ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో చాలా పాపులర్ అయ్యింది. టైం పాస్ కోసం ఈ గేమ్ ఆడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి తెలిసింది. కాస్త సరదా ఉండటంతో దీనికి పిల్లలతోపాటు పెద్దలు కూడా అడిక్ట్ అయ్యారు.