5G Network Issue : 5జీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఇష్యూ ఉందా ? పరిష్కారాలు ఇవిగో

5G Network Issue :  ఇటీవల కాలంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు కొనేవారి సంఖ్య బాగా పెరిగింది.

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 08:23 AM IST

5G Network Issue :  ఇటీవల కాలంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుందనే ఉద్దేశంతో అందరూ 5జీకి మారిపోతున్నారు. భారీ అంచనాలతో 5జీ ఫోన్ కొన్నాక.. నెట్‌ వర్క్ ఇష్యూ‌స్‌ను ఎదుర్కొని చాలామంది సతమతం అవుతున్నారు. నెట్‌వర్క్ ఇష్యూను ఎలా ఫిక్స్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు.  అలాంటి వారి కోసమే ఈ టిప్స్..

We’re now on WhatsApp. Click to Join

సిమ్ స్లాట్

మనదేశంలో 5జీ నెట్‌వర్క్ ఇంకా అన్ని ఏరియాల్లో అందుబాటులోకి రాలేదు. మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే 5జీ ఫోన్లు ఉన్నవారికి.. కొన్ని ఏరియాల్లో 5జీ సిగ్నల్స్ అందవు. 5జీ నెట్‌వర్క్ ఇష్యూస్ వస్తుంటే మీరు మొదట చూడాల్సింది. మీ సిమ్ స్లాట్‌ను !! చాలా సందర్భాలలో 5జీ స్మార్ట్ ఫోన్లు మొదటి సిమ్ స్లాట్‌లో మాత్రమే 5జీ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. అందుకే 5జీ సిమ్‌ను మొదటి స్లాట్‌లో ఉండేలా చూసుకోండి.

రీఛార్జ్ ప్లాన్లు

5జీ సర్వీసుల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు యూజర్లకు ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G సేవలు అందిస్తున్నాయి.  అయితే షరతులు వర్తిస్తాయి. ఇందుకోసం కొన్ని నిర్దిష్ట ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

యాప్‌లోకి వెళ్లి యాక్టివేట్

మనం ఏదైతే సిమ్‌ను వాడుతున్నామో.. ఆ టెలికాం కంపెనీకి సంబంధించిన యాప్‌లోకి వెళ్లి 5జీ సర్వీసును  యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ 5జీ సిమ్ వాడితే Airtel Thanks యాప్.. జియో 5జీ సిమ్ వాడితే MyJio యాప్‌లోకి ఈమేరకు అప్‌డేట్ చేసుకోండి.

  • 3జీ, 4జీ సిమ్‌లు వాడుతున్న వారు 5జీ సేవలను  పొందలేరు.
  • కానీ 3జీ సిమ్ నుంచి 4జీలోకి మార్చవచ్చు. ఇందుకోసం కొత్త 4జీ సిమ్ కార్డు తీసుకోవాలి. అయితే మీరు వాడే స్మార్ట్‌ఫోన్లలో 4జీ/5జీ టైప్ సెలెక్ట్ చేసుకున్నారని నిర్ధారించుకోండి.
  • మీరు నివసించే లేదా ప్రయాణించే ఏరియాలో 5జీ నెట్వర్క్ సిగ్నల్ వీక్‌గా ఉంటే.. 4జీ సిగ్నల్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఒకవేళ తప్పకుండా 5జీ సిగ్నలే కావాలని భావిస్తే మీ ఫోన్ సెట్టింగులో ఓన్లీ 5జీ నెట్‌వర్క్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

Also Read : YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!