Social Robots : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుమ్ము రేపుతోంది. ఏఐతో పనిచేసే రోబోలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. మనుషుల మనోభావాలను అర్థం చేసుకుంటూ సత్తా చాటుతున్నాయి. నేటి బిజీ జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న వారి మనసులను గెల్చుకుంటున్నాయి. అలాంటి సోషల్ రోబోల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Professor Shanthamma : జేడీ వాన్స్, ఉష దంపతులకు శాంతమ్మ అభినందనలు.. ఈమె ఎవరు ?
తీరొక్క మనుషులు.. తీరొక్క రోబోలు
సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్నవే సోషల్ రోబోలు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి మనోభావాలు, మానసిక స్థితిగతులు ఒక్కోలా ఉంటాయి. కుక్క నుంచి కుందేలు వరకు ఒక్కో జంతువు ప్రవర్తనా శైలి విభిన్నంగా ఉంటుంది. వీటికి అనుగుణంగా స్పందించేలా.. తీరొక్క ఏఐ రోబోలను(Social Robots) తయారు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక మనిషి నిత్యం ఒంటరితనాన్ని ఫీల్ అయితే.. అతడికి ఇన్‌స్టాంట్‌గా తోడు కావాలి. ఈ లోటును ఏఐ సోషల్ రోబోలు భర్తీ చేస్తున్నాయి. చైనాల వీటి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ వీటిని కొనేస్తున్నారు. 2033 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.3 లక్షల కోట్ల సోషల్ రోబోల వ్యాపారం జరుగుతుందని అంచనా.
Also Read :Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా
ఈ రోబోల గురించి తెలుసా ?
- బూబూ (BooBoo) రోబో చైనాలోని పిల్లల మది దోస్తోంది. ఎందుకంటే ఇది పిల్లల మైండ్‌ను బాగా అర్థం చేసుకుంటుంది. వారి మాటలకు చిలిపిగా, తెలివిగా స్పందిస్తుంది. చురుకైన సమాధానాలు ఇస్తుంది. దీని ధర దాదాపు రూ.15వేలు. 2024 మే నుంచి ఇప్పటివరకు చైనాలో దాదాపు 1000 బూబూ రోబోలను సేల్ చేశారు.
- బేబీ ఆల్ఫా(BabyAlpha) అనే రోబోల సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఇంట్లో పెంపుడు కుక్కలు కలిగిన వారు ఈ ఏఐ కుక్కలను సైతం కొనేస్తున్నారు. తాము ఇంట్లో లేనప్పుడు కుక్కలకు తోడుగా బేబీ ఆల్ఫాలను ఉంచుతున్నారు. వీటి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాకా ఉంది.
- అలౌ (Aluo) రోబో అనేది ఒంటరిగా ఇళ్లలో ఉండేవారి కోసం డిజైన్ చేసినది. వారితో ఫ్రెండ్‌లా మాట్లాడుతూ కలిసిపోవడమే దీని ప్రత్యేకత. ఒంటరిగా ఉన్నప్పుడు మెదడులో రేకెత్తే ఆలోచనలను ఇది అర్థం చేసుకోగలదు. ఆ సమయంలో మనిషి మాట్లాడే మాటలకు బాగా స్పందించగలదు. టైంపాస్ చేయగలదు.