Site icon HashtagU Telugu

Rs 820 Crores YouTuber : 820 కోట్లు సంపాదించిన యూట్యూబర్ కథ

Rs 820 Crores Youtuber

Rs 820 Crores Youtuber

Rs 820 Crores YouTuber : లక్షలు, కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్లను మనం చూస్తున్నాం.. 

కానీ ఒక యూట్యూబర్ ఏకంగా బిలియనీర్ అయ్యాడు.. 

ఇప్పుడు అతడి నెట్ వర్త్ (నికర ఆస్తి విలువ) రూ.820 కోట్లు.  

ఇంతకీ అతడెవరు ? యూట్యూబ్ లో ఇంతగా ఎలా సంపాదించాడు ? 

 ఔను.. మనం చెప్పుకోబోయేది అతగాడి గురించే!!  మిస్టర్ బీస్ట్ (MrBeast) యూట్యూబ్ ఛానల్ తో 16.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల  మదిని దోచిన 25 ఏళ్ళ  స్వీడన్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ సంపాదన గురించి మనం తెలుసుకోబోతున్నాం..  తన ఛానల్ సబ్‌స్క్రైబర్ల  సంఖ్య 4 కోట్లకు చేరిన సందర్భంగా 40 మంది  సబ్‌స్క్రైబర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి 40 కార్లను గిఫ్ట్ గా ఇచ్చేసిన మిస్టర్ బీస్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం.. 

Also read : Lottery-13 States-Why : లాటరీ టికెట్ల సేల్స్.. 13 రాష్ట్రాల్లోనే ఎందుకు ?

2021లో మొత్తం రూ.2,400 కోట్లు..

జిమ్మీ డొనాల్డ్‌సన్ గత 13 ఏళ్లుగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. అతడు  ఒక్క వీడియోను యూట్యూబ్ లో పెట్టాడంటే కోట్ల వ్యూస్ కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి.  2017 జనవరిలో అతడు చేసిన ఒక వీడియోతో మిస్టర్ బీస్ట్ కు లక్ష మంది సబ్‌స్క్రైబర్‌ లు కొత్తగా వచ్చి చేరారు. ఎంతో ఫేమస్ అయ్యాడు. గత రెండేళ్లుగా అత్యధిక పేమెంట్స్ తీసుకుంటున్న యూట్యూబర్స్  లిస్ట్ లో జిమ్మీ డొనాల్డ్‌సన్ వరల్డ్  నంబర్ 1  ప్లేస్ లో ఉన్నాడు. టాప్ 10 యూట్యూబర్స్ అందరూ కలిసి  2021లో మొత్తం రూ.2,400 కోట్లు(Rs 820 Crores YouTuber) సంపాదించారని ఒక అంచనా. ఇలా సంపాదించిన డబ్బుతో జిమ్మీ డొనాల్డ్‌సన్ నార్త్ కరోలినాలోని గ్రీన్‌విల్లే వెలుపల ఒక కల్-డి-సాక్‌లో  5 బిల్డింగ్ లను కొన్నాడు. తన కుటుంబం, ఉద్యోగుల కోసం నార్త్ కరోలినాలోని తన పరిసరాల్లో చాలా ఇళ్లను కొన్నాడు. బీస్ట్‌కి ఇష్టమైన కారు BMW i8. అతని దగ్గర టెస్లా, లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్ కార్లు కూడా ఉన్నాయి.

Also read : 6G-India : 6జీ రెడీ అవుతుందోచ్.. 200 పేటెంట్లు కొన్న ఇండియా

సబ్‌స్క్రైబర్ కు ద్వీపం రాసిచ్చాడు..

జిమ్మీ డొనాల్డ్‌సన్ తన సబ్‌స్క్రైబర్ నంబర్ 10 కోట్లకు చేరిన తర్వాత ఒక ద్వీపాన్ని ఒక సబ్ స్క్రైబర్ కు గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇందుకోసం 50 మందిని ఎంపిక చేశారు. ద్వీపం యొక్క నిజమైన యజమానిని ఎంచుకోవడానికి అనేక పోటీలు నిర్వహించాడు. ఐదుగురు వ్యక్తులు చివరి రౌండ్‌కు చేరుకున్నారు. యూట్యూబ్‌లో 100 మిలియన్ యూట్యూబ్‌ బటన్‌లను కనుగొనడం చివరి టాస్క్. ఒక పార్టిసిపెంట్ కొన్ని గంటలు  కష్టపడి వాటిని కనుగొన్నాడు. జిమ్మీ డొనాల్డ్‌సన్  నుంచి ద్వీపాన్ని పొందాడు. మిగిలిన నలుగురు పోటీదారులకు చెరో రూ.41 లక్షలను జిమ్మీ డొనాల్డ్‌సన్  ఇచ్చాడు.