Telegram Malware: టెలిగ్రామ్ లో వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే?

ఇటీవల కాలంలో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారులతో పాటు టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో టెలిగ్రామ్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది.

  • Written By:
  • Updated On - July 26, 2024 / 01:42 PM IST

ఇటీవల కాలంలో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారులతో పాటు టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో టెలిగ్రామ్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. మనం పంపే ఫైల్ సైజ్ ఎంత ఉన్నా టెలిగ్రామ్‌లో ఈజీగా పంపుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది టెలిగ్రామ్‌ ను వాడుతున్నారు. అలాగే క్వాలిటీ మిస్ అవ్వకుండా వీడియోలు సెండ్ చేయాలంటే టెలీగ్రామ్‌ ను యువత అధికంగా వాడుతున్నారు. అయితే టెలీగ్రామ్ ద్వారా వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి ఈఎస్ఈటీ పరిశోధకులు తాజాగా షాక్ ఇచ్చారు.

టెలీగ్రామ్ వీడియోల ద్వారా ఈవిల్ వీడియో అనే మాల్‌వేర్ మీ ఫోన్‌లో ప్రవేశించి మీ ఫోన్‌లోని సమాచారాన్ని మొత్తం దుండగులకు చేరవేసే ప్రమాదం ఉందని వారు గుర్తించారు. అందువల్ల టెలీగ్రామ్ యూజర్లను జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. టెలీగ్రామ్ 10.14.4 లేదా అంతకంటే పాత వెర్షన్లను వాడే వారికి ఈ ముప్పు ఎక్కువ ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రత్యేకంగా రూపొందించిన మల్టీమీడియా ఫైల్స్‌ను చాట్స్ లేదా ఛానెల్స్‌లో దుండగులు అప్‌లోడ్ చేస్తున్నారు. అనుకోకుండా ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ యాప్ అయిన మాల్వేర్ మల్టీ మీడియా ప్రివ్యూగా కనిపిస్తుందట. ఇది బైనరీ అటాచ్‌మెంట్ రూపంలో కూడా కనిపించడం లేదని పరిశోధకులు గుర్తించారు.

ఈ హానికరమైన ఫైల్ 30 సెకన్ల వీడియోలా కనిపిస్తోందట. ఈ ఫైల్ డిఫాల్ట్‌గా డౌన్‌ లోడ్ అయ్యేలా ముష్కరులు టెలీగ్రామ్ సెట్టింగ్స్‌ ను సెట్ చేశారు. వినియోగదారు సంబంధిత చాట్‌ ను తెరిచిన వెంటనే ఈ మాల్వేర్ డౌన్‌లోడ్ అవుతుందట. టెలిగ్రామ్ యూజర్ వీడియో మీడియా ఫైల్‌ ను క్లిక్ చేశాక, యాప్ ఎర్రర్ చూపిస్తుందట. అంటే తెలివిగా టెలీగ్రామ్ యాప్ ఎర్రర్ వచ్చిందనేలా వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ యూజర్ కంగారు పడి యాక్సెప్ట్ ఆప్షన్ ను ఎంచుకుంటే థర్డ్ పార్టీ పర్మిషన్ అడుగుతుంది. ఎప్పుడైతే యూజర్ దాన్ని ఓకే చేసి ఓపెన్ చేస్తాడో ఇక అంతే ఆ యాప్‌కు మీరు అన్ని పర్మిషన్లు ఇచ్చేసినట్లే. ఈ యాప్ ఇన్స్టాలేషన్ టెలిగ్రామ్ వినియోగదారుకు ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Follow us