Site icon HashtagU Telugu

Car Overheats: కారు పదేపదే వేడెక్కుతోందా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Car Overheats

Car Overheats

సాధారణంగా సెలవులు ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి కార్లలో లాంగ్ టూర్లకు వెళ్తూ ఉంటారు. అయితే కారు ఎక్కువసేపు నడపాలి అనుకున్న వారు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. అటువంటి వాటిలో హీటింగ్ సమస్య మొదటిది అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సార్లు కారు ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల కారు ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. మరి కారు ఓవర్ హీట్ అయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా కారు ఇంజన్ వేడెక్కడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అధిక ఉష్ణోగ్రతలో కారు నడపడం, రెండవది అత్యంత వేడి వాతావరణంలో కార్ నడుపుతున్నప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత పోలిస్తే కార్ ఇంజన్ మరింత వేగంగా వేడెక్కుతుంది.

అలాగే కారును ఎక్కువ సేపు కంటిన్యూగా నడపడం వల్ల కూడా కారు వేడెక్కుతుంది. మరి కారు వేడెక్కినప్పుడు ఏం చేయాలి అన్న విషయం చూస్తే.. మొదట కారును ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆపి, దాదాపు అరగంట పాటు ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు సరైన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అదేవిధంగా నడుస్తున్న కారులో రేడియేటర్ క్యాప్ ఎప్పుడూ తీసివేయ కూడదు. ఎందుకంటే ఇంజిన్‌ను చల్లగా ఉంచడం రేడియేటర్ పని. ఇంజిన్‌ను చల్లబరచడానికి రేడియేటర్‌లో కులెంట్ వాడుతుంటాం. రేడియేటర్ క్యాప్ తెరవడానికి ప్రయత్నించినట్లయితే దానిలో చాలా ప్రజర్ ఉంటుంది కాబట్టి క్యాప్ తీసేటప్పుడు చాలా వేగంగా కులెంట్ బయటకు వస్తుంది.

ఇది మీ చేతులు సహా శరీర భాగాల పై పడితే మంటగా ఉంటుంది. కాబట్టి దాన్ని తెరవాలనుకుంటే, మొదట కారుని కొంత సమయం పాటు ఆఫ్ చేసి, ఇంజిన్ చల్లబడిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయాలి. కారులోని అన్ని భాగాలు సరిగ్గా చేస్తూ కారులో కూలెంట్ ఉంటే కారు ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ అయిన కూడా వేడెక్కితే కారు కూలెంట్ ఎక్కడి నుండైనా లీక్ అవుతుందో చెక్ చేయాలి. లీక్ సంభవించినప్పుడు, కులెంట్ నెమ్మదిగా తగ్గి ఇంజిన్ వేడెక్కుతుంది.