Site icon HashtagU Telugu

WhatsApp New Features : వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌.. మరో నాలుగు కొత్త ఫీచర్లు

Whatsapp New Features Audio Calling Video Calling

WhatsApp New Features : వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో నాలుగు నూతన ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ అన్నీ వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ క్వాలిటీని మరింత పెంచుతాయి. యూజర్లకు అదనపు సౌకర్యంతో పాటు ఫన్‌ను అందిస్తాయి. ఇంతకీ ఆ ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Warangal NIT Jobs : నెలకు లక్షన్నర దాకా శాలరీ.. వరంగల్ నిట్‌లో 56 నాన్‌ టీచింగ్ జాబ్స్

ఫన్నీ టూల్స్

వాట్సాప్‌లో మనం నిత్యం ఎంతోమందికి వీడియో కాల్స్‌ను చేస్తుంటాం. వీటిలో గ్రూప్ వీడియో కాల్స్ కూడా చాలానే ఉంటాయి.   గ్రూప్​ వీడియో కాల్స్ చేసే క్రమంలో సరదాగా ముచ్చటించుకుంటూ ఉంటాం. ఫ్యామిలీ విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. జోక్స్ వేసుకుంటూ.. నవ్వులు విరబూయిస్తూ గ్రూప్ వీడియో కాల్స్ కొనసాగుతాయి. వాట్సాప్‌లో ఇకపై గ్రూప్ వీడియో కాల్స్ చేసే క్రమంలో రకరకాల ఫన్నీ టూల్స్​ ఆప్షన్​ కనిపిస్తాయి. స్నాప్ ఛాట్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా వాట్సాప్‌లో అద్భుతమైన టూల్స్‌ను యాడ్ చేశారు. గ్రూప్ వీడియో కాల్స్ చేసే క్రమంలో కుక్కపిల్ల చెవుల వంటి దాదాపు 10 కొత్త వీడియో ఫన్ ఎఫెక్ట్‌ టూల్స్‌ను మనం వాడుకోవచ్చు.

వాట్సాప్‌లో డెస్క్‌టాప్ కాలింగ్ ఫీచర్‌ను మరింత బెటర్‌గా మార్చారు. దీనికి మరిన్ని ఫంక్షన్‌లను కొత్తగా యాడ్ చేశారు. వాట్సాప్ డెస్క్‌టాప్ కాలింగ్ ఫీచర్‌‌లో కొత్త విషయం ఏమిటంటే.. కాల్స్ ట్యాబ్ నుంచి నేరుగా కాల్ లింక్‌ను క్రియేట్ చేయొచ్చు. నేరుగా మరో వాట్సాప్ నంబరుకు మనం డయల్ చేయొచ్చు.

గ్రూప్ కాల్స్ నోటిఫికేషన్ 

వాట్సాప్‌లోని గ్రూప్ వీడియో​ కాల్స్​ ఫీచర్‌‌ను(WhatsApp New Features) సరికొత్తగా తీర్చిదిద్దారు.  ఇంతకుముందు వాట్సాప్​ గ్రూప్​లో ఎవరైనా వీడియో కాల్ చేస్తే.. గ్రూప్​లోని మెంబర్స్ అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వెళ్లిపోయేది. తద్వారా వాట్సాప్ గ్రూప్​లోని ఎవరైనా ఆ వీడియో కాల్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. కొత్త విషయం ఏమిటంటే.. ​వాట్సాప్ గ్రూప్​ కాల్స్​లో ​పార్టిసిపెంట్స్​ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రూప్ వీడియో కాల్ చేసే టైంలో మనం ఎంచుకున్న వారికి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. ఫలితంగా వాట్సాప్ గ్రూప్‌లోని మెంబర్స్ అందరికీ డిస్టర్బెన్స్ ఉండదు. దీంతోపాటు వాట్సాప్‌లో వీడియో క్వాలిటీ మునుపటి కంటే బెటర్‌గా మారింది. మొబైల్ లేదా డెస్క్​టాప్​ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేస్తే.. మునుపటి కంటే ఎక్కువ రిజల్యూషన్​తో వీడియో ఇమేజ్ మనకు కనిపిస్తుంది.

Exit mobile version