Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫొటోస్ షేర్ చేయండిలా?

Mixcollage 23 Jan 2024 02 01 Pm 6721

Mixcollage 23 Jan 2024 02 01 Pm 6721

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ.

తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలుగా గతేడాది 2 జీబీ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ అచ్చంగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ నియర్‌బై షేర్‌ ఐఓఎస్‌ ఎయిర్‌ డ్రాప్‌ తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ విషయాన్ని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో తెలిపింది. ఇదిలా ఉంటే ఫొటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి అత్యంత వేగంగా షేర్‌ చేసుకునేందుకుగాను షేర్‌ ఇట్‌ యాప్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్‌పై కేంద్రం నిషేధం విధించడంతో గూగుల్‌ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో నియర్‌బై షేర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో తాజాగా వాట్సాప్‌ నియర్‌బైకి పోటీగా ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

Exit mobile version