Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే మరో స్టన్నింగ్ ఫీచర్!

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇటీవల కాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అవి ఒకదానిని నుంచి ఒకటి ఉన్నాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫీచర్ లను విడుదల చేస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. అధునాతన టెక్నాలజీని జోడిస్తూ ఈ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్. ముఖ్యంగా యువతను అట్రాక్ట్‌ చేస్తూ మంచి ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే త్వరలో మరో సరికొత్త ఫీచర్ ని తీసుకు రాబోతోంది వాట్సాప్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే..

సెర్చ్‌ ఇమేజెస్‌ ఆన్‌ ది వెబ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్స్ తమకు చాట్‌ లో వచ్చిన ఇమేజెస్‌ ను గూగుల్‌ లో వెళ్లి సెర్చ్ చేయవచ్చట. ప్రస్తుతం ఫేక్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్న తరుణంలో వాటికి చెక్‌ పెట్టడం కోసం వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తసుకొస్తోంది. మీకు వచ్చిన ఫొటో నిజమైందేనా? లేక ఎడిట్‌ చేసిందా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సదరు ఫొటో సోర్స్‌ కూడా ఏంటో చెప్పవచ్చు.

ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యతకు ఎలాంటి ముప్పు ఉండదని వాట్సాప్‌ చెబుతోంది. ప్రస్తుతం డెవలపింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే టెస్టింగ్‌కు తీసుకొచ్చి యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లకు మరింత ఊరట లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇటీవల కాలంలో వాట్సాప్ లో వస్తున్న ఫేక్ ఫోటోలకు చెక్ పెట్టినట్టు అవుతుంది.