Site icon HashtagU Telugu

WhatsApp New Feature: ఇకపై వాట్సాప్ లో ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ పంపవచ్చట.. అదెలా అంటే?

Mixcollage 22 Jul 2024 10 21 Am 5479

Mixcollage 22 Jul 2024 10 21 Am 5479

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్ లను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా కూడా అలాంటి ఒక సరికొత్త ఫీచర్ ని వినియోగదారులకు పరిచయం చేసింది. మామూలుగా మనం వాట్సాప్ ని ఉపయోగించాలి అంటే నెట్ తప్పకుండా ఉండాల్సిందే.

వేరే వాళ్లకు ఫోటోలు లింక్స్ వీడియోస్ ఫైల్స్ పంపించాలి అన్న ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇకమీదట అవసరం లేకుండానే పెద్ద పెద్ద ఫైల్స్ పంపవచ్చుంటుంది వాట్సాప్ సంస్థ. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఇంటర్నెట్ లేకుండా అంటే వినియోగదారులు ఎల్లప్పుడూ ఇంటర్నెట్‌ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ కొత్త ఫీచర్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డబ్ల్యుఎబెటాఇన్ఫో తన నివేదికలో ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని తెలిపింది. రాబోయే పీపుల్ నియ‌ర్‌బై ఫీచర్ ఐఓఎస్‌ యాప్‌లో భవిష్యత్తులో అప్‌డేట్ కోసం రావచ్చు. 2024 ఏప్రిల్‌లో ఆండ్రాయిడ్‌ లో ఈ ఫీచర్‌పై కంపెనీ కసరత్తు చేసింది.

ఈ ఫీచర్‌తో సమీపంలో ఉన్న వ్యక్తులకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫైల్స్ ని సులభంగా పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చట. ఇందులో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మరెన్నో ఉండవచ్చని చెబుతోంది. ఈ ఫీచర్ స్క్రీన్ గ్రాఫ్ ప్రకారం ఐఓఎస్ మెకానిజంలో ఫైళ్లను షేర్ చేయాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం తప్పనిసరి. ఇంటర్నెట్ ద్వారా ఫైళ్లను పంచుకోవడం సాధ్యం కాని కాంటాక్ట్‌లు, వాట్సాప్ ఖాతాల మధ్య ఫైల్ షేరింగ్‌ను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో పెద్ద ఫైళ్లను షేర్ చేసుకోవడం సులభం చేస్తుంది. వినియోగదారులు రోజువారీ డేటాను ఆదా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.