Whatspp: వాట్సాప్ లో సెల్ఫ్ చాట్ అప్డేట్.. ఎప్పటి నుంచంటే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనం దగ్గర తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది

  • Written By:
  • Updated On - October 31, 2022 / 04:56 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనం దగ్గర తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది వినియోగదారులు ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఈ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య రోజుకి గణనీయంగా పెరుగుతూనే ఉంది. తన ఈ మెసేజ్ యాప్ వాట్సాప్ ను చాటింగ్ వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు వినియోగిస్తున్న వాటిలో వాట్సాప్ కూడా ఒకటి.

అయితే వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఇప్పటికే వాట్సాప్ లో అనేక రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రైవసీ విషయంలో, ప్రొఫైల్ విషయంలో, సెట్టింగ్స్ విషయంలో ఎన్నో రకాల మార్పులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

అదేమిటంటే ఇప్పటికే అనేక రకాల ఫీచర్ లను ప్రవేశపెట్టిన వాట్సాప్ సంస్థ మరొక టీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందట. ఇందులో భాగంగానే సెల్ఫ్ చాట్ ఫీచర్ ను అభివృద్ధి చేసింది వాట్సాప్ సంస్థ. ఎవరికి వారే మెసేజ్ చేసుకునే ఈ ఫీచర్ పై ఐఓఎస్ ఆండ్రాయిడ్ వర్షన్ లతో బీటా టెస్టింగ్ మొదలైందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం బీటా టెస్టర్లకు మాత్రం అందుబాటులో ఉంది. ఇక ఈ ఫీచర్లో భాగంగా మన నెంబర్కు మనమే మెసేజ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకమైన చాట్ విండో అంటూ ఉండదు. మన వాట్సాప్ కాంటాక్ట్ లో మన నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పర్సనల్ చాట్ బాక్స్ కనిపిస్తుంది. ఆ వాట్సాప్ కాంటాక్ట్ జాబితాలో మన ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ విధంగా సెల్ఫ్ చాట్ చేసుకోవచ్చు. అలాగే నచ్చిన మీడియా ఫైల్స్ ను తన నెంబర్ కి పంపించి సేవ్ చేసుకోవచ్చు.