WhatsApp : ప్రపంచంలోనే అత్యధిక యూజర్లను కలిగిన మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ఓ వెలుగు వెలుగుతోంది. ఈ యాప్‌కు ఓనర్ మరెవరో కాదు.. మార్క్ జుకర్ బర్గ్. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లను జోడించడంపై ఆయన ఫోకస్ పెట్టారు. కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయడంలో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయనుంది. వాట్సాప్‌కు లింక్ అయి ఉన్న డివైజ్‌లలోనూ కాంటాక్ట్ నంబరును సేవ్ చేయడమే ఆ కొత్త ఫీచర్ ప్రత్యేకత.
Also Read :Bangladesh Protests : దేశాధ్యక్షుడి భవనంలోకి నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
ప్రస్తుతానికి వాట్సప్‌లోని(WhatsApp) ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ను మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఇకపై వాట్సాప్ లింక్డ్ డివైజ్‌లలో కూడా కాంటాక్ట్‌ను సేవ్ చేయొచ్చు. వాట్సాప్‌ను ఒకటికి మించిన డివైజ్‌లలో వాడే వారికి ఇదొక గుడ్ న్యూస్. త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్, విండోస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇకపై కాంటాక్ట్‌ను సేవ్ చేసేటప్పుడు కేవలం వాట్సాప్‌లో యాడ్ చేయాలా? మొబైల్‌లోనూ యాడ్ చేయాలా? అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మనకు ఏది అవసరమైతే అది ఎంపిక చేసుకోవచ్చు. మనం వాట్సాప్‌లో కాంటాక్ట్‌లను సేవ్ చేసుకుంటే.. ఒకవేళ ఫోన్‌ను పోగొట్టుకున్నా, మొబైల్‌ని మార్చినా వాట్సాప్‌లోని కాంటాక్ట్ నంబర్లు అలాగే ఉంటాయి. ఈ ఫీచర్లు డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఇవి యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.
Also Read :Priyanka Gandhi : వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్.. రాహుల్ ఏమన్నారంటే..
వాట్సాప్ మాతృ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో కీలక ముందడుగు వేసింది. ప్రజలు పదేపదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఒక్క వాట్సాప్ ద్వారా చిటికెలో ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం అందించే సేవల్లో అత్యధిక భాగం వాట్సాప్ ద్వారానే ప్రజలకు చేరువలో ఉండనున్నాయి. సర్టిఫికెట్ల మంజూరు దగ్గరి నుంచి చిన్న చిన్న పనులకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు దోహదం చేయనున్నాయి.