Site icon HashtagU Telugu

WhatsApp Messages Recovery: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలా అంటే?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ అప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వాట్సప్ యూజర్లను దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థ వారు యూజర్ల కోసం, యూజర్లను ఆకట్టుకోవడం కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోని తాజాగా వాట్సాప్ సంస్థ వారు మరొక సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే ఇప్పటికే వాట్సాప్ మెసేజ్ ల విషయంలో పలు రకాల అప్డేట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ లో మనం అవతలి వ్యక్తికి మెసేజ్ చేసినప్పుడు అనుకోకుండా ఏదైనా తప్పుగా మెసేజ్ చేసినప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కి బదులుగా డిలీట్ ఫర్ మీ అని కొడుతూ ఉంటారు. దాంతో అవతలి వ్యక్తి కి మెసేజ్ డిలీట్ కాదు. వాట్సాప్ లో ఈ సమస్యతో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అటువంటి వారి కోసం తాజాగా వాట్సాప్ సంస్థ ఒక అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

అదేమిటంటే undo ఫీచర్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్ ను కొన్ని సెకండ్ల వరకు రికవర్ చేయవచ్చు. ఆ తర్వాత Delete for everyone పై క్లిక్ చేస్తే ఆ మెసేజ్ వాళ్లకు డిలీట్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. బీటా యూజర్లకు వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానుంది.