Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై క్షణాల్లో అవతార్ క్రియేట్?

Mixcollage 06 Jul 2024 06 14 Pm 8297

Mixcollage 06 Jul 2024 06 14 Pm 8297

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ.

ఇకపోతే ప్రస్తుతం వాట్సాప్‌ కొత్త ఏఐ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అనేక దేశాల్లోని వాట్సాప్‌ వినియోగదారులకు మెటా ఏఐ చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో ఇమేజ్‌లు క్రియేట్‌ చేయవచ్చు, తెలియని వంటకాల రెసిపీలు తెలుసుకోవచ్చు. అలానే త్వరలోనే వాట్సాప్‌ మీ ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌లను క్రియేట్ చేసుకునే ఆప్షన్‌ అందించనుంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తోంది.
ఆండ్రాయిడ్ బీటా 2.24.14.13 వెర్షన్‌లో టెస్ట్‌ చేస్తున్న ఈ ఫీచర్‌ను టిప్‌స్టర్స్ గుర్తించారు. త్వరలో ఈ ఆప్షన్‌ బీటా టెస్టర్‌ లకు అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మీ ఫోటో తీసి, తర్వాత మీ ఏఐ ఇమేజెస్‌ క్రియేట్‌ చేయమని మెటా ఏఐని అడగవచ్చు. ఇందుకు మెటా ఏఐ చాట్‌లో ఇమేజిన్‌ మీ అని టైప్ చేయాలి. అలానే @metaAI imagine me… అని టైప్ చేసి ఇతర చాట్‌ లలో కూడా ఈ ఫీచర్‌ ను ఉపయోగించవచ్చు. అయితే ఈ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులోకి రానుంది.