ఇక ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..వారికి షాకింగ్ న్యూస్

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని ఉపయోగించేవారికి బ్యాడ్ న్యూస్. డిసెంబర్ 31వ తేది తర్వాత, వాట్సాప్‌ చాలా స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదని సమాచారం.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 05:49 PM IST

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని ఉపయోగించేవారికి బ్యాడ్ న్యూస్. డిసెంబర్ 31వ తేది తర్వాత, వాట్సాప్‌ చాలా స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదని సమాచారం. టైమ్ అయిపోయిన మొబైల్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నట్లైతే అందులో వాట్సాప్ ఇకపై పనిచేయకపోవచ్చు. కొత్త ఏడాది నుంచి 49 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదని, అందులో యాపిల్ ఐఫోన్ కూడా ఉండనుందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

ప్రతి ఏడాది వాట్సాప్‌ ఎన్నో పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ ని నిలిపివేస్తున్నట్లు తెలుపుతుంది. సపోర్ట్ నిలిపివేయడం అంటే కొన్ని డివైజెస్ లకు వాట్సాప్ కొత్త అప్ డేట్స్ ఫామ్ అవ్వవు. అందులో కొత్త అప్ డేట్లు విడుదల కావు. ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్ పని చేస్తూ ఉన్నా అందులో అప్ డేట్లు లేకపోవడం వల్ల యాప్ కొత్త ఫీచర్ ను పొందలేరని తెలుస్తోంది. అందులో సెక్యూరిటీ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.

2022 డిసెంబర్ 31వ తేది నుండి చాలా స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ సపోర్ట్ ఆపివేయబడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఏయే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదో కూడా ఒక నివేదికను విడుదల చేసింది. వాట్సాప్ విడుదల చేసిన లిస్ట్ లో ఆపిల్, శ్యామ్ సంగ్ నుంచి హువేయి వరకూ స్మార్టు ఫోన్లు ఉండటం గమనార్హం.

ఆపిల్ ఐఫోన్ 5,
ఆపిల్ ఐఫోన్ 5సి
హెచ్‌టి‌సి డిజైర్ 500
హువేయి అసెండ్ D
హువేయి అసెండ్ D1
హువేయి అసెండ్ D2
హువేయి అసెండ్ G740
హువేయి అసెండ్ Mate
హువేయి అసెండ్ P1
లెనోవా A820
ఎల్‌జి ఎనాక్ట్
ఎల్‌జి లూసిడ్ 2
ఎల్‌జి ఆప్టిమస్ F3Q
ఎల్‌జి ఆప్టిమస్ F3
ఎల్‌జి ఆప్టిమస్ F5
ఎల్‌జి ఆప్టిమస్ F6
ఎల్‌జి ఆప్టిమస్ F7
ఎల్‌జి ఆప్టిమస్ L2 II
ఎల్‌జి ఆప్టిమస్ L3 II
ఎల్‌జి ఆప్టిమస్ L5
ఎల్‌జి ఆప్టిమస్ L7
ఎల్‌జి ఆప్టిమస్ L4 II
ఎల్‌జి ఆప్టిమస్ L5 II
ఎల్‌జి ఆప్టిమస్ L7 II
ఎల్‌జి ఆప్టిమస్ 4X HD
ఎల్‌జి ఆప్టిమస్ L4 II డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ L5 డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ L3 II డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ నైట్రో HD
ఎల్‌జి ఆప్టిమస్ L7 II డ్యూయల్
శామ్‌సంగ్ గెలాక్సీ Ace 2
శామ్‌సంగ్ గెలాక్సీ కోర్
శామ్‌సంగ్ గెలాక్సీ s2
శామ్‌సంగ్ గెలాక్సీ Trend II
శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
శామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2
శామ్‌సంగ్ గెలాక్సీ s3 Mini
గ్రాండ్ S ఫ్లెక్స్ ZTE
గ్రాండ్ X క్వాడ్ V987 ZTE
సోనీ ఎక్స్‌పీరియా మీరో
సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్స్
సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్

వంటి ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని ఫోన్లలో వాట్సాప్ అప్ డేట్లు ఇకపై ఇన్ స్టాల్ కావని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ ఈ ప్రకటన చేయడంతో యూజర్లు షాక్ అవుతున్నారు.