Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి షాక్.. ఇకపై వాటికి డబ్బులు చెల్లించాల్సిందే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజి

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 04:00 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇలా తరచుగా వాట్సాప్ అప్డేట్ లకు సంబందించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.

అలా తాజాగా కూడా వాట్సాప్ కి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్‌ యూజర్లు తమ చాట్‌ బ్యాకప్‌ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండగా 2024 నుంచి గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ అన్‌ లిమిటెడ్ బ్యాకప్‌లను అందించదని కంపెనీ తెలిపింది. ఇక నుంచి వాట్సాప్‌ బ్యాకప్స్‌ కు లిమిటెడ్ స్టోరేజీ కోటా మాత్రమే లభిస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌లో అందించే 15జీబీ స్టోరేజ్‌ లిమిట్‌ మాత్రమే ఉచితంగా అందిస్తారు. అయితే స్టోరేజీ పెంచుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.

చాట్ బ్యాకప్స్‌ కు గూగుల్ డ్రైవ్‌ లో స్పేస్ కేటాయించే రూల్ 2024 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్ 2.23.26.7లో ఈ విషయాన్ని వివరిస్తూ ఒక మెసేజ్‌ వచ్చింది. గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్‌ లు ఇకపై అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ ఉచితంగా లభించని తెలిపారు. వాట్సాప్‌ యూజర్లు ఇకపై తమ బ్యాకప్‌లను ఉంచుకోవాలనుకుంటే స్టోరేజ్‌ స్పేస్‌ మెయింటైన్‌ చేయాలి. లేదంటే ఎక్స్‌ట్రా స్టోరేజ్‌ కోసం డబ్బులు చెల్లించాలి. యూజర్లు ఎంత స్టోరేజీని ఉపయోగించుకున్నారో తెలియాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ రివ్యూ ఆప్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ స్టోరేజ్‌ కోసం ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..