WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. చాట్స్ లో మరో సరికొత్త ఫీచర్?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 07:00 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరొక ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా చాట్ బ్యాక్అప్ కష్టాలను తొలగించవచ్చు. ఈజీగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సప్‌‌ కల్పించనుంది. ఇందుకోసం వాట్సాప్ సంస్థ త్వరలోనే చాట్ ట్రాన్స్‌ఫర్ అనే ఫీచర్‌ని తీసుకురాబోతోంది. ఈ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ అంటే ఏంటి? ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా ఈ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు సులువుగా మెసేజ్‌లను స్టోర్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే కేవలం లోకల్ నెట్‌వర్క్ ద్వారానే ఈ టాస్క్‌ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. అయితే వాట్సాప్ సంస్థ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ని వినియోగించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానుంది. ఓ క్యూఆర్ కోడ్ ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు తమ డేటాని ఏ స్మార్ట్‌ఫోన్‌కి సెండ్‌ చేయాలని అనుకుంటున్నారో ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. దీంతో ప్రస్తుతం వినియోగిస్తున్న డివైజ్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది.

మామూలుగా అయితే వాట్సాప్ మెసేజ్ లను డేటాను భద్రపరుచుకోవాలి అంతే బ్యాకప్ చేయాలి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవు. చాట్ ట్రాన్స్‌ఫర్’ దీనికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. యూజర్లు తమ డేటాను డ్రైవ్‌లోకి, క్లౌడ్ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేయాల్సిన పని ఉండదు. కేవలం వేరే డివైజ్‌ల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి స్టోర్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసినప్పుడు, వేరే ఫోన్‌లో వాట్సప్‌ లాగిన్ అయినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో తీసుకొచ్చే అప్డేట్‌లలో భాగంగా ఈ ఫీచర్‌ అందించనున్నారు. మరోవైపు వాట్సప్‌ ప్రాక్సీ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.