WhatsApp Alert : వాళ్లకు వాట్సాప్‌ ‘స్క్రీన్ షేర్’ చేశారో అంతే సంగతులు!

WhatsApp Alert : సైబర్ కేటుగాళ్లు కొత్తకొత్త మోసాలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 12:36 PM IST

WhatsApp Alert : సైబర్ కేటుగాళ్లు కొత్తకొత్త మోసాలు చేస్తున్నారు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ‘స్క్రీన్ షేర్ ఫీచర్‌’ను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు, సైబర్ దొంగలు హ్యాకింగ్‌కు తెగబడుతున్నారు. వాట్సాప్ యూజర్స్ ఎవరికి పడితే వారికి.. అపరిచితులకు ‘స్క్రీన్ షేర్ ఫీచర్‌’ ద్వారా పర్మిషన్‌ను మంజూరు చేస్తే చాలా రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈవిధంగా ఫోన్‌లోకి చొరబడే ఛాన్స్‌ను హ్యాకర్లకు  ఇస్తే.. మొత్తం బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మోసాలను ‘వాట్సాప్ స్క్రీన్ షేరింగ్  స్కామ్’ అని పిలుస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

‘మీ వాట్సాప్‌లో ఒక సమస్య తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి’.. ‘మీ ఫోన్‌లో ఒక సమస్య తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి’.. వంటి మెసేజ్‌లను హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల ఫోన్లకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెసేజ్‌లలోని లింకులను క్లిక్ చేస్తే.. అవి వాట్సాప్‌కు రీడైరెక్ట్ అవుతాయి. అనంతరం ‘స్క్రీన్ షేరింగ్ ఎనేబుల్’ అనే పర్మిషన్‌ను కోరే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పర్మిషన్‌కు వాట్సాప్ యూజర్  ఓకే చేస్తే.. వెంటనే హ్యాకర్లకు మన వాట్సాప్‌పై, మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై కంట్రోల్ వచ్చేస్తుంది. అనంతరం హ్యాకర్లు హ్యాక్ చేసిన ఫోనులో ట్రాకింగ్ కోసం మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే ముప్పు ఉంటుంది. దీంతోపాటు ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, మెసేజీల ఆధారంగా వాట్సాప్ యూజర్ బ్యాంకు అకౌంట్లు, యూపీఐ ఖాతాల వివరాలను కూడా హ్యాకర్లు దొంగిలిస్తారు. సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్‌లను కూడా చోరీ చేస్తారు.

Also Read: YS Sharmila : కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ?

స్కామర్ల నుంచి రక్షణ ఇలా.. 

  • వీడియో కాల్‌లో స్క్రీన్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీరు చూపించాలనుకుంటున్న ఫైల్‌ను మాత్రమే తెరవండి. మీ పాస్‌వర్డ్‌ల వంటివి రాసి ఉంచిన ఫైళ్లను, నోట్‌ప్యాడ్‌లను తెరవకండి.
  • వాట్సాప్‌లో(WhatsApp Alert) తెలియని ఫోన్ నంబర్ల నుంచి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు సమాధానం ఇవ్వకుండా ఉండండి. సందేహాలు ఉంటే.. కొనసాగించే ముందు కాలర్ గుర్తింపును ధృవీకరించండి.
  • ఫోన్ ద్వారా ఎవరికీ  ఓటీపీలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీలు ఇవ్వొద్దు.
  • మీ పాస్‌వర్డ్‌లను సీక్రెట్‌గా ఉంచండి.
  • అధికారిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఫోన్‌లో ఎవరు చెప్పినా నమ్మొద్దు.