Site icon HashtagU Telugu

Whats APP : అలర్ట్.. అక్టోబర్ నుంచి ఈ ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు..ఎందుకంటే?

Whatsapp

Whatsapp

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాట్సాప్ ఒకటి. ఫేస్‌బుక్‌  సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ద్వారా ప్రతిరోజు ఎంతో మంది ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి ఎంతో తొందరగా పంపుతున్నారు. అయితే అక్టోబర్ నుంచి కొన్ని రకాల మొబైల్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.అయితే అక్టోబర్ నుంచి ఈ విధమైనటువంటి మొబైల్ ఫోన్లో వాట్సప్ పనిచేయదు అనే విషయానికి వస్తే..

ఆపిల్‌ ఇటీవల ఇచ్చిన సపోర్ట్ అప్‌డేట్  ప్రకారం కొన్ని పాత iPhoneలలో వాట్సాప్ పనిచేయదని వెల్లడించారు.WABetaInfo ప్రకారం iOS 10, iOS 11 పరికరాలలో అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి ఐఫోన్ ఉపయోగించే వినియోగదారులకు కూడా ఈ సమాచారాన్ని అందించారు. అయితే ఈ మొబైల్ ఫోన్లో వాట్సప్ పని చేయాలంటే ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు.

మరి ఐఫోన్ ఎలా అప్డేట్ చేయాలి అనే విషయానికి వస్తే.. iOS 10,  iOS 11 పాత ఆపరేటింగ్ సిస్టం కనుక ఈ ఫోన్ లో వాట్సప్ పనిచేయాలంటే సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఎంచుకొని పాత ఐఫోన్లను అప్డేట్ చేసుకోవాలి. ఇలా లేటెస్ట్‌ iOS వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్నప్పుడే ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుందని వెల్లడించారు. ఇలా పాత వర్షన్ ఐఫోన్లు వాడేవాళ్లు వెంటనే అప్డేట్ చేసుకోకపోతే వారి మొబైల్ ఫోన్లో వాట్సప్ పని చేయదు.