Site icon HashtagU Telugu

WhatsApp: త్వరలో వాట్సాప్ లో 3 సరికొత్త ఆప్షన్లు.. ఎడిట్, అన్ డూ, చాట్ ఫిల్టర్స్ !!

Whatsapp Imresizer

Whatsapp Imresizer

వాట్సాప్ లో మరో 3 కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. అవి వస్తే వాట్సాప్ వినియోగదారులకు ఎంతో సౌకర్యం కలుగనుంది. వాటిలో మొట్టమొదటిది “ఎడిట్ టెక్స్ట్ మెసేజ్”(edit text message) ఫీచర్. మనం ఇతరులకు పంపే మెసేజ్ లో ఏదైనా తప్పు ఉంటే .. దాన్ని పూర్తిగా డిలీట్ చేసి, మరో మెసేజ్ ను కొత్తగా పంపాల్సి వస్తోంది. దీన్ని విలువైన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మనం పంపిన వాట్సాప్ మెసేజ్ లో ఏదైనా తప్పు, మార్పు ఉంటే .. ఎడిట్ చేసే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఇతరుల ఫోన్లకు చేరిన మెసేజ్ ..
మనం ఎడిట్ చేసిన విధంగా అప్ డేట్ అయిపోతుంది. ఫలితంగా వాట్సాప్ మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసేయొచ్చు.

“undo” ఫీచర్..

వాట్సాప్ లో “undo” (అన్ డూ) అనే ఫీచర్ కూడా రాబోతోంది. మనం ఇతరులకు పంపిన మెసేజ్ లు అప్పుడప్పుడు వెంటనే డిలీట్ చేస్తుంటాం. ఈక్రమంలో “delete for me” అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటాం. ఇటువంటి సందర్భంలో డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందలేం. కానీ త్వరలో మనం “delete for me” అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే.. “undo” అనే మరో ఆప్షన్ ప్రత్యక్షం అవుతుంది. అంటే డిలీట్ అయిన మెసేజ్ ను తిరిగి పొందే అవకాశం లభిస్తోందన్న మాట.

chat filters ఫీచర్..

chat filters అనే ఆప్షన్ కూడా వాట్సాప్ లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీన్ని డెస్క్ టాప్ వర్షన్ల కోసం పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సెర్చ్ బార్ పక్కనే.. chat filters ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ..మనం ఇప్పటికే చదివిన వాట్సాప్ మెసేజ్ లన్నీ మాయం అవుతాయి. ఇంకా మనం తెరువని మెసేజ్ లు మాత్రమే కనిపిస్తాయి. వీటిని చదివాక.. clear filters అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే చాట్ బాక్స్ మునుపటిలా కనిపిస్తుంది.