Site icon HashtagU Telugu

Verification Checkmark : వాట్సాప్ లోనూ ఇక బ్లూ టిక్.. జుకర్ బర్గ్ బిజినెస్ స్ట్రాటజీ

Verification Checkmark

Verification Checkmark

Verification Checkmark : ప్రస్తుతం వెరిఫై చేసిన వాట్సాప్ ఛానెళ్లు, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకు గ్రీన్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను అందిస్తున్నారు. ఈ బ్యాడ్జ్ త్వరలోనే బ్లూ కలర్ లోకి మారిపోనుంది. గ్రీన్ కలర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ స్థానంలో బ్లూ కలర్ చెక్‌మార్క్ ను ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మార్పు జరిగిన తర్వాత వాట్సాప్ లోని ఛానెల్‌లు, బిజినెస్ అకౌంట్ల ప్రొఫైల్‌లపై బ్లూ కలర్ చెక్ మార్క్  కనిపిస్తుంది. ఇది చూడటానికి అచ్చం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలోని చెక్‌మార్క్ లాగే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మార్పుతో కూడిన ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.20.18 బీటా వర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది.

Also read : Illuminating Paris Fashion Week : 3D లైట్స్ తో ‘వెరైటీ డ్రెస్’

మార్క్ జుకర్ బర్గ్ బిజినెస్ ప్లాన్ ?

మార్క్ జుకర్ బర్గ్ తనకు చెందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు చెందిన వెరిఫికేషన్ మార్క్స్ బ్లూ కలర్ లోనే ఉండాలని కోరుకుంటున్నారని.. అందుకే ఈ మార్పు చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ల కోసం ఏకకాలంలో బ్లూ టిక్ వెరిఫికేషన్ మార్క్ ను కొనే వెసులుబాటును నెటిజన్స్ కు కల్పించేందుకే ఈ మార్పును జుకర్ బర్గ్ చేస్తున్నారని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇందుకు అనుగుణంగా రానున్న కాలంలో ప్యాకేజీలను జుకర్ బర్గ్ కంపెనీ మెటా ప్రకటించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ లో 3 ఏఐ ఫీచర్లు 

వాట్సాప్ లో 3 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా తీసుకొచ్చారు. ఇందులో స్టిక్కర్లు, చాట్‌లు, ఫొటోలు ఉన్నాయి.  ఏఐ స్టిక్కర్ ఫీచర్ కింద వినియోగదారులు AI సహాయంతో స్టిక్కర్‌లను క్రియేట్ చేయొచ్చు. వాటిని స్నేహితులతో పంచుకోవచ్చు. ఇక ఏఐ చాట్ ఫీచర్ ఉపయోగించి వినియోగదారులు WhatsAppలో మెటా ఏఐ చాట్‌బాట్‌ ను ప్రశ్నలు అడగొచ్చు. ఏఐ ఇమేజ్ ఫీచర్‌తో వినియోగదారులు AI సహాయంతో ఫొటోలను (Verification Checkmark) తయారు చేయొచ్చు.