Whatsapp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. లాక్ చేసిన వాట్సాప్ ఛాట్లను దాచడానికి ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.22.9 వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ యూజర్స్ తాము లాక్ చేసిన వాట్సాప్ ఛాట్ లను హైడ్ కూడా (Whatsapp Feature) చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
లాక్ చేసిన చాట్‌ల జాబితాను యాక్సెస్ చేయడానికి ఒక ఎంట్రీ పాయింట్ అనేది చాట్ లిస్ట్‌లో కనిపిస్తుంది. దీని సహకారంతో ఫోన్ కు యాక్సెస్ ఉన్నవారు ఎవరైనా ఈజీగానే లాక్ చేసిన ఛాట్స్ ను చూడొచ్చు. అయితే ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఫీచర్ వచ్చాక.. దాన్ని యూజర్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లాక్ చేసిన ఛాట్స్ లో హైడ్ చేయదల్చుకున్న వాటిని సెలెక్ట్ చేసి.. టాప్ లో ఉన్న సెర్చ్ బార్ ద్వారా ఒక సీక్రెట్ కోడ్‌ను జనరేట్ చేసుకోవాలి. దీంతో మనం సెలెక్ట్ చేసిన లాక్డ్ ఛాట్స్ హైడ్ అయిపోతాయి. మళ్లీ మనం ఆ సీక్రెట్ కోడ్ ను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ ఛాట్స్ కనిపిస్తాయి.
Also Read: Kisan Credit Card: సులువుగా కిసాన్ క్రెడిట్ కార్డు .. దరఖాస్తు చేసుకోండి ఇలా..!
ఎవరైనా ఫోన్ ను దొంగిలించినా.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ను లాక్కొని చూసినా.. అందులో హైడ్ చేసిన లాక్డ్ ఛాట్స్ ఉన్నాయని గుర్తించలేరు. ఫలితంగా వాట్సాప్ లో ఉన్న కీలకమైన ఛాట్స్ సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. దీంతోపాటు ఒకే ఫోన్ లో ఒకటికి మించి వాట్సాప్ అకౌంట్లను వినియోగించే వెసులుబాటును కల్పించే సౌకర్యం కూడా అందుబాటులోకి రాబోతోంది. మరో నెలలోగా ఇది రిలీజ్ అవుతుందని అంటున్నారు. డ్యూయల్ సిమ్ ఫోన్‌లను ఉపయోగించే వ్యక్తులకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.