Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై డబుల్ ట్యాప్ ఫీచర్?

Mixcollage 30 Jul 2024 12 57 Pm 3714

Mixcollage 30 Jul 2024 12 57 Pm 3714

వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా మనం ఏదైనా మెసేజ్ వస్తే యూజర్లు స్పందించడానికి టెక్ట్స్ మీద ప్రెస్ చేసి ఉంటాము. ఇలా చేస్తే కొన్ని రకాల ఎమోజీలు వస్తాయి. ఆ తర్వాత ఏది కావాలో సెలక్ట్ చేసుకుంటాము. కానీ ఇకపై అలా కాకుండా డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుందట. ఇకపై టెక్ట్స్‌పై డబుల్ ట్యాప్ చేయడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్‌ పై వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది వినియోగదారులకు సందేశాలకు వెంటనే స్పందించడానికి ఇబ్బంది లేని మార్గాన్ని అందిస్తుందట. అయితే రియాక్షన్ ఎమోజీ డిఫాల్ట్‌గా సెట్ చేయబడుతుందని భావిస్తున్నారు. కస్టమైజ్డ్ పద్ధతిలో వినియోగదారులు సందేశానికి ప్రతి స్పందించే ప్రస్తుత మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందట. అయితే నిర్దిష్ట సందేశం, ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్‌లకు స్పందించడానికి డబుల్ ట్యాప్ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. రియాక్షన్ డిఫాల్ట్‌గా సెట్ చేస్తారు. ఇది హార్ట్ సింబల్ ఉండే ఎమోజీగా ఉంటుందని భావిస్తున్నారు. స్క్రీన్‌ పై డబుల్ క్లిక్ చేయడం ద్వారా సందేశాలకు ప్రతి స్పందించినప్పుడు, హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీ రావడం అనేది ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్.

ఈ ఫీచర్ కూడా అలానే ఉపయోగించే మాదిరిగానే ఉంటుంది. వాట్సప్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను మనం పొందవచ్చు.అంటే వాట్సాప్ రియాక్షన్ ఫీచర్ వేగవంతమైన విధానంలో రాబోతోంది. ఇకపై యూజర్లు రియాక్షన్ ఇవ్వడానికి టెక్ట్స్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా డబుల్ ట్యాప్‌తో సందేశాలకు ప్రతిస్పందించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది.