ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. వీడియో కాల్స్,మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ సెండ్ చేయడం కోసం వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సైబర్ పోలీసులు అలాగే టెక్ నిపుణులు ఈ విషయం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం ఏదో ఒక విధంగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రకరకాల మెసేజ్లు పంపడం వాటిని క్లిక్ చేయమని చెప్పడం ఒకసారి క్లిక్ చేస్తే వాటి ద్వారా మన డేటా మొత్తం వారికి బదిలీ అవ్వడంతో పాటు మన అకౌంట్ డీటెయిల్స్ అమౌంట్ డబ్బులు కట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి నాలుగింటి గురించి ఇప్పుడు వాట్సాప్ సంస్థ వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆ నాలుగు రకాల మెసేజ్ లు ఏవో అవి క్లిక్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జాబ్ ఆఫర్.. ఉపాధి పేరుతో సైబర్ నేరగాళ్లు యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. యువతకు మంచి ఉద్యోగం ఇవ్వడానికి లింక్ పంపిస్తుంటారు. అందులో వారి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలని అడుగుతారు. హ్యాకర్లు పంపిన లింక్ పై క్లిక్ చేసి, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని పూరించినట్లయితే మీ సంగతి అంతే. అది వెంటనే హ్యాకర్లకు చేరుతుంది. దీని తర్వాత, సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను హరించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి జాబ్ ఆఫర్ ఉంది లాంటి మెసేజ్లు వస్తే వెంటనే వాటిని తిరస్కరించండి.
ప్రైజ్ మనీ లేదా లాటరీ.. వాట్సాప్ లో కూడా లాటరీ, బహుమతుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. మోసగాళ్లు తమ పేరు మీద లాటరీ లేదా బహుమతి గెలుచుకున్నట్లు ప్రజలకు సందేశాలు పంపుతారు. మీ బ్యాంక్ ఖాతాలో ప్రైజ్ మనీని పొందడానికి వివరాలను అందించాలని చెబుతుంటారు. అయితే డబ్బుపై ఉన్న దురాశ కారణంగా చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటారు. అప్పుడు వారు సైబర్ మోసానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్త పడడం లేదంటే సైబర్ పోలీసులను ఆశ్రయించడం మంచిది.
బ్యాంక్ అలర్ట్ KYC అప్‌డేట్.. ఈ రోజుల్లో దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా వినియోగదారులతో కనెక్ట్ అవుతున్నాయి. ఖదీమ్ లు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి హ్యాకర్లు బ్యాంక్ ఖాతాదారులకు లింక్ ను పంపుతారు. మీరు ఈ లింక్ లో మీ కేవైసీ వివరాలను పూరించిన వెంటనే, ఈ సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు మీ బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది.
డెలివరీ స్కామ్.. హ్యాకర్లు వాట్సాప్ ద్వారా డెలివరీ ఫెయిల్యూర్ గురించి వ్యక్తులకు నోటిఫికేషన్ లు పంపి పేరు, చిరునామాతో సహా పలు వ్యక్తిగత సమాచారాన్ని అడిగే మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత హ్యాకర్లు ఈ సమాచారాన్ని మోసం కోసం ఉపయోగిస్తారట. కాబట్టి ఈ డెలివరీ స్కామ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మీ వాట్సాప్ లో మీకు ఈ 4 మెసేజ్‌లు వస్తే, వాటిని విస్మరించడని చెబుతున్నారు.