WhatsApp Offline File Sharing : ఇంటర్నెట్ లేకున్నా ఫైల్స్​​ షేరింగ్.. వాట్సాప్‌ కొత్త ఫీచర్​​

WhatsApp Offline File Sharing : ఇంటర్నెట్‌తోనే మనం ప్రతి పనిని చేస్తున్నాం.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 10:09 AM IST

WhatsApp Offline File Sharing : ఇంటర్నెట్‌తోనే మనం ప్రతి పనిని చేస్తున్నాం. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు ఫైల్స్‌ను సెండ్ చేయాలన్నా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నాం. అయితే ఇంటర్నెట్ లేకున్నా.. ఈ తరహా సేవను తమ యూజర్లు పొందేలా చేయనుంది వాట్సాప్ !!  ఇంతకీ ఎలా ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

ఈ మధ్యకాలంలో యూజర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సోషల్ మీడియా యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్!! ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌటూ అక్కర్లేదు. త్వరలోనే మనం ఇంటర్నెట్‌ లేకున్నావాట్సాప్‌ నుంచి ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను ఇతరులకు షేర్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా మనం ఇంటర్నెట్ లేనప్పుడు బ్లూటూత్‌ సాయంతో షేర్‌ ఇట్‌, నియర్‌ బై షేర్‌ వంటి యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, సినిమాల ఫైళ్లను షేర్ చేసుకుంటూ ఉంటాం.  అచ్చం అదే తరహా సర్వీసు ఇకపై వాట్సాప్‌లో(WhatsApp Offline File Sharing) అందుబాటులోకి వచ్చేస్తుంది. దీనివల్ల ఇక మనం ఇలాంటి అవసరం కోసం మరో యాప్‌ను వాడాల్సిన పని తప్పుతుంది.

Also Read : Balakrishna Vs Paripoornananda : పరిపూర్ణానంద ఎంట్రీ.. బాలయ్య ఇలాఖాలో ట్రయాంగిల్ ఫైట్ ?

ఈ ఫీచర్‌‌ను వాట్సాప్‌లో ఎనేబుల్‌ చేసేందుకుగానూ వాట్సాప్‌ సిస్టమ్‌ ఫైల్‌, ఫొటో గ్యాలరీలను యాక్సెస్‌‌  చేయడానికి మీరు అనుమతులను మంజూరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరికైతే ఫైల్స్‌ను పంపించాలని భావిస్తున్నారో.. ఆ వ్యక్తి సెల్‌ఫోన్ బ్లూటూత్‌ కనెక్ట్‌ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్​లైన్‌ షేరింగ్ చేయడానికి వీలు కలుగుతుంది.  మన బ్లూటూత్‌‌ను ఆన్‌ చేసి దగ్గర్లోని వాట్సాప్‌ యూజర్‌ పరికరాన్ని గుర్తించి ఫైల్‌‌ను సెండ్‌ చేయాల్సి ఉంటుంది.  అవతలి వ్యక్తి పర్మిషన్ ఇస్తేనే.. మనం వాళ్లకు ఫైళ్లు పంపడం సాధ్యమవుతుంది.

Also Read : Richest Bollywood Family : బాలీవుడ్‌లో నంబర్ 1 ధనిక ఫ్యామిలీ ఏదో తెలుసా ?