WhatApp Feature: త్వరలోనే వాట్సాప్ లో కొత్త ఫీచర్.. పంపిన మెసేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చు!

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 12:31 PM IST

వాట్సాప్ ఈ సోషల్ మీడియా యాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాది మంది ఈ ప్లాట్ ఫామ్ లో ఇతరులతో చాట్ చేస్తూ ఈ యాప్ ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పంపిన మెసేజ్ లో ఏదైనా తప్పు ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేసి తరువాత మళ్ళీ మెసేజ్ పంపడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ఇబ్బందికరంగా, అలాగే అవతలి వ్యక్తులు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అటువంటి వారికోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తోందట. ఆ ఫీచర్ ఓకే అయ్యి అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందట.

మరి ఆ ఫీచర్ ఏంటి ఎలా పని చేస్తుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. మెసేజ్ పంపిన తర్వాత కూడా యూసర్ లు ఎడిట్ చేసే ఫీచర్ ను వాట్సాప్ పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ట్రాక్టర్ డబ్ల్యూఏబిటాఇన్ఫో వెల్లడించింది. మెసేజ్ టైప్ చేసిన తర్వాత హోల్డ్ చేసి పట్టుకొని మెనూ పై క్లిక్ చేస్తే ప్రస్తుతం ఇన్ఫో, కాఫీ అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ఫీచర్ వస్తే వాటి కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అని పేర్కొంది. అవతల వ్యక్తికి పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసుకునే ఫీచర్ ను వాట్సాప్ టెస్ట్ చేస్తోందని, అందుకు సంబంధించి స్క్రీన్ షాట్ ను కూడా డబ్ల్యూఏబిటాఇన్ఫో వెల్లడించింది.

అలాగే హ్యాపీ జర్నీ ద్వారా మెసేజ్ ను ఎడిట్ చేస్తే ఆ విషయం రిసీవ్ చేసుకున్న యూజర్స్ కు కూడా తెలుస్తుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అదేవిధంగా ఎడిట్ చేసిన తర్వాత ఏ మార్పులు చేశామో అన్నది చూడటానికి చూసే విధంగా హిస్టరీ కూడా ఉండకపోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోని బట్టి చూస్తే ఎడిట్ టీచర్ టెస్టింగ్ స్క్రీన్ షాట్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ కు సంబంధించింది అని తెలుస్తోంది. అయితే ఐ ఓ ఎస్ డెస్క్ టాప్ వెర్షన్ లకు కూడా ఎడిట్ ఆప్షన్ ను వాట్సాప్ పరిశీలిస్తోందని సమాచారం. మరి ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది అన్నది కచ్చితంగా సమాచారం తెలియదు.