Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. థీమ్ చాట్ ఫీచర్ ని పరిచయం చేసిన వాట్సాప్!

Whatsapp

Whatsapp

ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం పెరిగిపోవడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగానే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ప్రైవసీ విషయంలో వాట్సాప్ స్టేటస్ ల విషయంలో చాటింగ్ విషయంలో ఇలా అనేక విషయాలలో మంచి మంచి ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది.

ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏమిటి అది ఎలా పని చేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే.. థీమ్‌ చాట్‌ పేరుతో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ కొత్త ఫీచర్‌ తో యూజర్లు అనేక రకాల థీమ్‌ లను తమ చాట్‌ కు యాడ్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. అలాగే యూజర్లు ఈ థీమ్‌ కు తమకు నచ్చిన కలర్స్‌ తో ఫిల్ చేసుకోవచ్చట. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే ఈ విషయాన్ని తాజాగా వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌ లో షేర్‌ చేసింది. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోని కూడా పంచుకుంది. మొదట ఈ సరికొత్త ఫీచర్ ని కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్ సంస్థ. మరి ఈ సరికొత్త ఫీచర్ వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.