ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
మరి ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా వాట్సాప్ ఉపయోగించే సమయంలో ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలంటే యాప్ ను బయటకు వచ్చి డైలర్ ఓపెన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇకపై వాట్సాప్ ను క్లోజ్ చేయకుండానే నార్మల్ కాల్స్ చేసుకునే అవకాశం లభించనుంది. ఇందుకోసమే కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నారు. ఇన్-యాప్ డయలర్ ఫీచర్ ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఇకపై ఎవరికైనా కాల్ చేయాలంటే వాట్సాప్ యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు.
నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని WABetaInfo పేర్కొంది. వాట్సాప్ లో కుడిపైపు దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ను తీసుకురానున్నారని దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.