Site icon HashtagU Telugu

WhatsApp: దీపావళి పండుగ తర్వాత ఆ ఫోన్లో వాట్సాప్ బంద్?

Whatsapp

Whatsapp

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ వాట్సాప్ ద్వారా నిత్యం లక్షలాదిమంది చాటింగ్ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాట్సాప్ యూజర్లకు ఒక బిగ్ షాక్ న్యూస్. ఎందుకంటే దీపావళి పండుగ తర్వాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట. ఏ ఫోన్లో పనిచేయదు ఎందుకు అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒకవేళ మీరు పాత ఐఫోన్ ని ఉపయోగిస్తున్న లేదంటే మీ ఫోన్లో ఐఓఎస్ పాత వెర్షన్ లో రన్ అవుతుంటే వెంటనే మీ ఫోన్ ని అప్ గ్రేడ్ చేయాలి. లేదంటే ఐఓఎస్ లేటెస్ట్ వెర్షన్ ను అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే ఇకపై ఆ ఫోన్లో వాట్సాప్ సేవలను వినియోగించడం కుదరదు. ఈ దీపావళి పండుగ అయిపోయిన తర్వాత కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ వార్త షాకింగ్ గా అనిపించినప్పటికీ ఇది నిజమే.

అక్టోబర్ 24 నుంచి ఐఫోన్ 5, ఐఫోన్ 5 సి మొబైల్స్ తో పాటు ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 తో పనిచేస్తున్న ఐఫోన్ లలో దీపావళి పండుగ తర్వాత వాట్సప్ సేవలను నిలిపి వేస్తున్నారు. అలా వాట్సాప్ సేవలను నిలిపివేయకుండా ఉండాలి అంటే ఆయా ఫోన్లలో ఐఓఎస్ 12 లేదా ఆపై వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఓఎస్ లు మీద పనిచేస్తున్న మొబైల్స్ లో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిపివేయబడతాయి. కాగా ఐఓఎస్ 10 ఐఓఎస్ 11 అనేవి పాత ఐఫోన్ ఆపరేటింగ్లు కాబట్టి ఇంకా ఫోన్ ని అప్డేట్ చేయకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి.