Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్స్ ఛానల్స్ జాయిన్ అవ్వచ్చట!

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగానే వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో బాగానే గత ఏడాది వాట్సాప్ వాట్సాప్ చానల్స్ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ ఛానల్స్ కోసమే లేటెస్ట్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. యాప్‌లోని క్యూఆర్ కోడ్ రెస్పాండ్ కోడ్‌ని ఉపయోగించి ఛానెల్‌ త్వరగా షేరింగ్, వ్యూ కోసం యూజర్లను అనుమతిస్తుందట.

ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా ఇటీవలి వెర్షన్‌ లలో టెస్టింగ్ చేసేందుకు ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాగా రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట. వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్‌ లను ఇతర యాప్‌ లకు కూడా ఎక్స్‌పోర్టు చేయవచ్చట. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ లలో ఫీచర్ ట్రాకర్ ద్వారా కొత్త క్యూఆర్ కోడ్ షేరింగ్ ఫంక్షనాలిటీని అందిస్తుందట ఆండ్రాయిడ్ 2.24.25.7 కోసం వాట్సాప్ బీటా లేదా ఐఓఎస్ 24.24.10.76 వాట్సాప్ బీటాకు అప్‌డేట్ చేసిన బీటా టెస్టర్లు కొత్త ఫీచర్‌ని ప్రయత్నించవచ్చని వాట్సాప్ సంస్థ తెలిపింది.

అయితే వాట్సాప్‌ లో ఫీచర్‌ ని ఎనేబుల్ చేసిన యూజర్లు యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌ లో ఉండాలి. ఇప్పటికే ఉన్న వాట్సాప్ ఛానెల్‌ ని నిర్వహించాలి. వాట్సాప్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌ ని ఓపెన్ చేసి షేరింగ్ ఆప్షన్‌ లను ఎంచుకోవాలి. క్యూఆర్ కోడ్‌ను రూపొందించే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. యాప్ క్యూఆర్ కోడ్‌ను రూపొందించిన తర్వాత యూజర్లు వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ లలో మరో యూజర్‌ తో షేర్ చేయగలరు. క్యూఆర్ కోడ్‌తో షేరింగ్ చేయవచ్చు. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా పంపవచ్చు లేదా ఇమెయిల్ చేసి ప్రింట్ చేస్తుంది.