WhatsApp Outage: గతంలోనూ వాట్సాప్‌కు అంతరాయం..!

వాట్సాప్.. ప్రస్తుత టెక్నాలజీ సమాజంలో ఈ పేరు తెలియనివారుండరు.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 03:52 PM IST

వాట్సాప్.. ప్రస్తుత టెక్నాలజీ సమాజంలో ఈ పేరు తెలియనివారుండరు. అయితే ఈ వాట్సాప్ సేవలు 2009లో ప్రారంభం అయ్యాయి. దాదాపు పుష్కర కాలంలో అనేక సార్లు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే తాజాగా ఏర్పడిన సమస్య మాత్రం 2 గంటలకు పైగా సేవలు నిలిచిపోయేలా చేసింది. చివరిసారిగా వాట్సాప్‌ సేవల్లో 2021 అక్టోబర్ లో సమస్యలు వచ్చాయి.

2021 అక్టోబర్ 4వ తేదీన రాత్రి 9 గంటల నుండి నిలిచిపోయిన వాట్సాప్ సుమారు ఏడు గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్లీ రీ-స్టార్ట్ అయ్యాయి. ఆ ఏడాది వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్‌ వైపు మొగ్గు చూపారు.

అయితే.. మంగళవారం మధ్యాహ్నాం 12 గంటల 30 నిమిషాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. సుమారు 2 గంటల తర్వాత వాట్సాప్ సేవలు తిరిగి పనిచేశాయి. సర్వర్ డౌన్ కావడంతో ఈ సమస్య ఏర్పడిందని, వాట్సాప్ టెక్ టీం స్పందించి సేవలను పునురద్దరించిందని సంస్థ తెలిపింది. దీంతో వాట్సాప్ వాడుతున్న యూజర్లు వాట్సాప్ తిరిగి పని చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. సేవల్లో అంతరాయానికిగానూ యూజర్లకు సంస్థ క్షమాపణలు చెప్పింది.