Site icon HashtagU Telugu

WhatsApp Delete Msg:వాట్సాప్ లో ఈ మార్పు గురించి మీకు తెలుసా.. సైలెంట్ గా మార్చేశారు తెలుసా?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అయితే ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ వాళ్ళు తాజాగా మరొక కీలక మార్పును చేశారు. అయితే వాట్సాప్ లో మనం మెసేజ్ చేసినప్పుడు దాన్ని డిలీట్ చేయాలి అంటే డిలీట్ ఫర్ మీ, డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ ల ద్వారా మనం మెసేజ్లను డిలీట్ చేస్తూ ఉంటాము.

అయితే వాట్సాప్ లో డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా మెసేజ్ లను డిలీట్ చేసే సమయాన్ని రెండు రోజుల వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్ ని గతంలోనే ప్రకటించినప్పటికీ బేటా వర్షన్ యూజర్లకు మాత్రమేనని తెలిపింది. కానీ ఎటువంటి ప్రకటన చేయకుండా వాట్సాప్ యూజర్ లందరికీ ఇటీవలే ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం కేవలం గంట వరకు మాత్రమే ఉండేది. కానీ తాజా అప్డేట్ తో ఆ మెసేజ్ ను రెండు రోజుల డిలీట్ చేసే ఆప్షన్ ను తీసుకువచ్చారు. అయితే ఈ ఫీచర్ కి సంబంధించి వాట్సప్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

వాట్సాప్ బ్యాక్ పేజీ కూడా గంట వరకు మాత్రమే ఆప్షన్ చూపిస్తోంది. కానీ ఆండ్రాయిడ్,ఐవోఎస్ పరిశీలించగా రెండు రోజుల వరకు డిలీట్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం అయ్యింది. అయితే ఈ వాట్సాప్ లో వచ్చిన ఈ సరికొత్త ఫీచర్ తో వినియోగదారులు బాగా సంతోషపడుతున్నారు. వాట్సాప్ సంస్థ వారు యూజర్ల కోసం సులభమైన అలాగే ఉపయోగపడే ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు.

Exit mobile version