WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై స్క్రీన్ షేరింగ్ లో ఆడియో ప్లే చేయండిలా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ ని నిత్యం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియో

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:40 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ ని నిత్యం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తూనే ఉంటారు. చాటింగ్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఫోటోస్ షేర్ ఇలా ఎన్నో విషయాల కోసం వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉంటారు. అయితే వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి? అది ఎలా పని చేస్తుంది అన్న వివరాల్లోకి వెళితే..

తాజాగా వాట్సాప్ సంస్థ షేర్ మ్యూజిక్ ఆడియో పేరుతో కొత్త స్పెసిఫికేషన్‌ ను వాట్సాప్ టెస్ట్ చేస్తోందని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్ వీడియో కాల్‌ లో స్క్రీన్ షేర్ చేసుకుంటే, మొబైల్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. మొబైల్ నుంచి వచ్చే ఆడియో అవతలి కాలర్‌ కు వినిపించదు. అయితే కొత్త అప్‌డేట్‌ తో స్క్రీన్ షేర్ చేస్తున్న వ్యక్తి ఫోన్‌ లోని ఆడియో కూడా అవతలి వ్యక్తికి వినిపిస్తుంది. దీంతో మొబైల్‌ లోని మ్యూజిక్‌ ను కాల్‌ లోని ఫ్రెండ్స్‌ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ కి షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ తో కాల్‌లో ఉన్న అవతలి వ్యక్తితో కలిసి ఆడియో లేదా మ్యూజిక్ వీడియోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

వీడియోను ప్లే చేస్తున్నప్పుడు కూడా స్క్రీన్‌ ని షేర్ చేయవచ్చు. వాట్సాప్ iOS బీటా వెర్షన్ 23.25.10.72లో ఈ ఫీచర్ కనిపించింది. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్న ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఈ ఫీచర్ వాయిస్ కాల్స్‌కు లేదా వీడియో డిసేబుల్ ఉన్న వీడియో కాల్స్‌కు సపోర్ట్ చేయదు. ఇద్దరు యూజర్లు వీడియోను ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది. ఈ ఫీచర్ ఎలా వాడాలి అన్న విషయానికి వస్తే…ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, ఫ్రెండ్స్‌లో లేదా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికో ఒకరికి వీడియో కాల్‌ చేసి, స్క్రీన్ కింద ఫ్లిప్ కెమెరా ఆప్షన్ పక్కన ఉన్న స్క్రీన్ షేర్ ఐకాన్‌ పై నొక్కాలి. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, డివైజ్‌లో ఏమేం ప్లే అవుతుందో ఇద్దరూ చూడగలరు, వినగలరు. యూట్యూబ్, స్పాటి ఫై, యాపిల్ మ్యూజిక్ మొదలైన ఏదైనా యాప్ లేదా సోర్స్ నుంచి ఏదైనా ఆడియో లేదా మ్యూజిక్ వీడియోను షేర్ చేయవచ్చు.