Site icon HashtagU Telugu

Whatsapp: 29 లక్షల వాట్సాప్ అకౌంట్లు నిషేధం.. కారణమిదే..?

Whatsapp Status

Whatsapp Status

దిగ్గజ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఏకకాలంలో 29 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలు జనవరి 1 నుండి జనవరి 31 మధ్య నిషేధించబడ్డాయి. వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 10 లక్షలకు పైగా భారతీయ ఖాతాలు చురుకుగా నిషేధించబడ్డాయి.

అంతకుముందు డిసెంబర్ 2022లో మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ దేశంలో 36 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ అకౌంట్లను రద్దు చేసినట్లు సంస్థ వెల్లడించింది. యూజర్ల ఫిర్యాదుతో కొన్నింటిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్ విభాగం సాయంతో మరికొన్ని అకౌంట్లను గుర్తించినట్లు పేర్కొంది. యూజర్ల భద్రతే తమ ప్రాధాన్యమని సంస్థ తెలిపింది.

జనవరి నెలలో, కంపెనీకి భారతదేశం నుండి 1,461 ఫిర్యాదులు వచ్చాయని వాట్సాప్ నివేదించింది. 195 ఫిర్యాదులపై చర్య తీసుకుంది. 1,461 ఫిర్యాదులలో 1,337 నిషేధ అప్పీళ్లకు సంబంధించినవి కాగా మిగిలినవి మద్దతు, భద్రతకు సంబంధించినవి. ఐటీ చట్టం 2021 నెలవారీ నివేదికలో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది.

Also Read: Women Premier League: వుమెన్స్ ఐపీఎల్‌.. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్స్‌

కొత్త ఐటీ నిబంధన ప్రకారం వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఈ ఖాతాలను నిషేధించింది. IT చట్టం 2021 ప్రకారం.. 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రతి నెలా IT మంత్రిత్వ శాఖకు వినియోగదారు భద్రతా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మునుపటి అన్ని ఫిర్యాదులకు సమాధానం ఇవ్వబడి, ప్రాసెస్ చేయబడుతుందని WhatsApp తెలిపింది.

డిసెంబర్‌లో వాట్సాప్ దేశంలో 36.77 లక్షల ఖాతాలను నిషేధించిందని, వాటిలో 10 లక్షలకు పైగా ఖాతాలు చురుకుగా నిషేధించబడ్డాయి. ఇందులో భారతీయ వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా 13.89 లక్షల ఖాతాలు మూసివేయబడ్డాయి. సోషల్ మీడియాలో వినియోగదారుల ఫిర్యాదులు నిరంతరం పెరుగుతున్నాయి. డిసెంబరులో వాట్సాప్ వినియోగదారుల అప్పీళ్లు దాదాపు 70 శాతం పెరిగి 1,607కి చేరాయి. ఇందులో 1,459 ఖాతాలను నిషేధించాలనే అప్పీళ్లు కూడా ఉన్నాయి.

Exit mobile version