New Search Feature : వాట్సాప్ అప్ డేట్స్ ట్యాబ్ లో ‘సెర్చ్’ ఫీచర్

New Search Feature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది.

Published By: HashtagU Telugu Desk
New Search Feature

New Search Feature

New Search Feature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. వాట్సాప్ అప్ డేట్స్ ట్యాబ్ కోసం  కొత్తగా ‘సెర్చ్ ఫీచర్‌’ను లాంచ్ చేయనుంది. దీనివల్ల వాట్సాప్ లో స్టేటస్ అప్‌డేట్స్, ఫాలో అవుతున్న ఛానెల్ అప్ డేట్స్, సర్టిఫైడ్ ఛానెల్ అప్ డేట్స్ ను వెతకడం ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 2.23.21.7లో వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. సెర్చ్ ఫీచర్ ను వాట్సాప్ యాప్ ఎగువ భాగంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కొంతమందికి ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు.

Also read : Curry Leaves Water Benefits: కరివేపాకు నీళ్లతో ఈ సమస్యలకు చెక్‌.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

మీ వాట్సాప్ లో సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో,  రాలేదో తెలుసుకోవాలంటే.. గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసిన తర్వాత రెండుసార్లు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ వాట్సాప్ లో ‘సెర్చ్ ఫీచర్’ ఒకవేళ అందుబాటులోకి వచ్చి ఉంటే వెంటనే ప్రత్యక్షం అవుతుంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు వాట్సాప్ వినియోగదారుల కోసం పిన్ చేసిన మెసేజ్ ల ఫీచర్,  రీడిజైన్ చేసిన చాట్ అటాచ్‌మెంట్ మెనూ వంటివి కూడా రాబోతున్నాయి. చాట్ సంభాషణల ఎగువకు పిన్ చేయడం ద్వారా కొన్ని ఎంపిక చేసుకున్న మెసేజ్ లను హైలైట్ చేయగలుగుతారు. ముఖ్యమైన మెసేజ్ లను ఈజీగా యాక్సెస్ (New Search Feature)  చేయగలుగుతారు.

We’re now on WhatsApp. Click to Join

  Last Updated: 06 Oct 2023, 09:58 AM IST