Site icon HashtagU Telugu

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. నెంబర్ సేవ్ చేయకుండానే యాడ్?

Whatsapp New Feature

Whatsapp New Feature

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ మరో సరికొత్త అదిరిపోయే అప్డేట్ ని తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా వాట్సాప్ సంస్థ తీసుకువచ్చిన ఆ ఫీచర్ ద్వారా మీరు కాంటాక్ట్ పేరును మీ ఫోన్లో సేవ్ చేయకుండానే వాట్సాప్ గ్రూప్ లలో యాడ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి. ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి వినియోగదారులు ఆ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ సేవ్ చేస్తేనే గానీ గ్రూప్ లో యాడ్ చేయడం కుదరదు. అయితే ఈ కొత్త అప్ డేట్ ద్వారా డైరెక్ట్ గా నంబర్ నే గ్రూప్ లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది అని తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. వినియోగదారులు తొందరగా గ్రూప్ ను క్రియేట్ చేయాలనుకొన్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

పేరులేని గ్రూప్ లో పేరు లేకుండా ఆరుగురిని యాడ్ చేయవచ్చు. గ్రూప్ లో ఉన్న వారి పేర్లు డైనమిక్‌గా పెట్టబడతాయి. ఈ ఫీచర్ వ్యక్తుల ప్రైవసీకి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గ్రూప్ లోని ప్రతి పార్టిసిపెంట్‌కు గ్రూప్ పేరు భిన్నంగా కనిపిస్తుందని వాట్సాప్ తెలిపింది. వారు తమ ఫోన్‌లో కాంటాక్ట్‌లను ఎలా సేవ్ చేసుకున్నారనే దాని ఆధారంగా ఈ పేరు ఉంటుంది. ఒకవేళ్ల మీ మీ కాంటాక్ట్ సేవ్ చేయని వ్యక్తులు మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తే, గ్రూప్ పేరుగా మీ ఫోన్ నంబర్ కనిపిస్తుంది.