WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌లను క్రియేట్ చేసుకోవచ్చట?

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియ

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 09:12 AM IST

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింత జోరుగా వాట్సాప్ వరుసగా ఒకదాని తరువాత ఒకటి అప్డేట్ లను విడుదల చేస్తూనే ఉంది.

అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. మరీ ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా కొత్త ఫీచర్ తో మరోసారి ముందుకు వచ్చింది. వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌ లను క్రియేట్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌లను సృష్టించడానికి యూజర్లను అనుమతిస్తుంది. అయితే వాట్సాప్ విడుదల చేసిన కొత్త ఫీచర్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వాారా సాధారణ గ్రూప్ చాట్‌లకు ఈవెంట్‌లను సృష్టించవచ్చు. ఇంతకు ముందు ఈ ఫీచర్ కేవలం కమ్యూనిటీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు సాధారణ గ్రూప్ చాట్‌లకూ విస్తరించింది.

యూజర్లు పరస్పరం సహకరించుకోవడానికి, సమన్వయం పెంచుకోవడానికి ఎంతో వీలుంటుంది. ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఈవెంట్లను సృష్టించడం సాధ్యమవుతుంది. కొత్త ఫీచర్ తో యూజర్లు పేరు, వివరణ, తేదీ, ఐచ్ఛిక స్థానం, ఈవెంట్ వివరాలను ఇన్‌పుట్ చేయవచ్చు. వాయిస్, వీడియో కాల్ అవసరమో నిర్ధారించుకోవచ్చు. కాగా ఈ ఫీచర ద్వారా పేపర్ క్లిప్ ఎంపికలకు కొత్త అప్‌డేట్ ద్వారా మార్పులు చేసే అవకాశం ఉంది. పేపర్ క్లిప్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఇమేజ్, డాక్యుమెంట్, ఆడియో, కాంటాక్ట్, లొకేషన్ ను జోడించవచ్చు. అలాగే ఎంపికలను తీసివేయడానికి అప్లికేషన్ అనుమతి ఇస్తుంది. అప్‌డేట్ చేసిన తర్వాత ఈవెంట్‌ను సృష్టించడానికి అప్లికేషన్ మరో ఎంపికను జోడిస్తుంది. గ్రూప్ చాట్‌లోని సభ్యులు ఈవెంట్ ఆహ్వానాలను చూడవచ్చు, అలాగే ఆమోదించగలరు.