Site icon HashtagU Telugu

Whatsapp Latest: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆన్ లైన్ స్టేటస్ ను హైడ్ చేయొచ్చు

Whatsapp Call

Whatsapp Call

వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో దుమ్ము లేపుతోంది.

వినియోగదారుల సౌకర్యమే టార్గెట్ గా దూసుకుపోతోంది.

యూజర్ల కోసం వాట్సాప్ “ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్” కూడా త్వరలో తీసుకు రానుంది.

వాట్సాప్ చాటింగ్ మన వ్యక్తిగత విషయం. వాట్సాప్ లో ఒకరితో చాట్ చేస్తుంటే, మన కాంటాక్ట్ లిస్ట్ లోని వారు.. మనం ఆన్ లైన్ లో ఉన్నట్టు తెలుసుకోగలరు. మరి ఇది గోప్యతకు భంగకరమేగా? అందుకే వాట్సాప్ దీనికి పరిష్కారం చూపించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మనం వాట్సాప్ లో ఉన్నప్పటికీ, అవతలి వారికి తెలియదు. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన వాట్సాప్ బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది.

సెట్టింగులు ఇలా ఉండొచ్చు..

ఈ వాట్సాప్ ట్రిక్స్ ద్వారా Android లేదా iOS యూజర్లు సులభంగా తమ ఆన్ లైన్ స్టేటస్ ను హైడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం
ముందుగా మీ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి. మీరు టాప్ రైట్ కార్నర్‌లో మూడు వర్టికల్ డాట్స్ వద్దకు వెళ్లాలి.యూజర్లు యాప్‌లో Settings మెనుపై క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు, అకౌంట్ ఆప్షన్ (Account Option) ఎంపికపై క్లిక్ చేసి, ఆపై Privacy ఆప్షన్ వెళ్లండి. చివరిగా స్టేటస్ ఆప్షన్ చూడవచ్చు. అందులో My Contacts, Nobody రెండు ఆప్షన్లు ఉంటాయి. మై కాంటాక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఆన్‌లైన్ స్టేటస్ మీ కాంటాక్టులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండవ ఆప్షన్ ఎంచుకుంటే.. Nobody, ప్రతి ఒక్కరి నుంచి Online Statusని హైడ్ చేస్తుంది.ఆప్షన్ బెనిఫిట్స్ ‘Nobody’ ఆప్షన్‌పై క్లిక్ చేయడంతో ఇతరుల Online Status కూడా హైడ్ అవుతుందని గమనించాలి. మరో మాటలో చెప్పాలంటే.. మీరు కూడా మీ స్నేహితుడి ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు. వాట్సాప్ ఈ సదుపాయాన్ని తెచ్చే వరకూ  వేచి చూడక తప్పదు. ఇక వాట్సాప్ విండోస్ బీటాలో పూర్తి ఫంక్షనల్ కాంటెక్స్ట్ మెనూని కూడా విడుదల చేస్తుందని తెలిపింది.