WhatsApp New Feature: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. పూర్తి వివరాలు ఇవే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగ

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 07:50 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉన్నారు. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త ఫీచర్ లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.

ఇకపై వాట్సాప్ లో షార్ట్ వీడియో మెసేజ్ లను పంపేందుకు వీలుగా కొత్త అప్ డేట్ ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్తో 60 సెకండ్ల నిడివితో వీడియో మెసేజ్ లను ఇతరులకు పంపడానికి వీలు కలుగుతుంది. వాయిస్ మెసేజ్ మాదిరిగానే వీడియో మెసేజ్ కూడా ఉపయోగపడుతుండటంతో వినియోగదారులు బాగానే దీనికి కనెక్ట్ అయ్యారు. అయితే కొందరు వినియోగదారులు మాత్రం ఈ ఫీచర్ వినియోగిస్తున్నప్పుడు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే వాయిస్ మెసేజ్ పంపాలనుకున్నప్పుడు కూడా పొరపాటున ఒక్కోసారి వీడియో మెసేజ్ వెళ్లిపోతోంది.

వాయిస్ మెసేజ్ బటన్ బదులు వీడియో క్లిక్ అయిపోవడం జరుగుతోంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టిన వాట్సాప్ ఒక పరిష్కారాన్ని తీసుకు వచ్చింది. వీడియో మెసేజ్ ఆప్షన్ ను పూర్తిగా డిసేబుల్ చేసుకొని, అవసరం అయినప్పుడు మాత్రమే ఉపయోగించుకునేలా కొత్త ఆప్షన్ ని తీసుకువచ్చింది. షార్ట్ వీడియో మెసేజెస్ ఫీచర్ వల్ల ఎదురవుతున్న సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఓ బటన్ ను తీసుకొచ్చింది. మనకు అవసరం లేనప్పుడు ఈ వీడియో మెసేజ్ ఆప్షన్ ను పూర్తిగా డిసేబుల్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ చాట్ సెట్టింగ్స్ మెనూలోకి ఈ కొత్త టోగుల్ ఫీచర్ ను అందించింది.

దీనిని డిసేబుల్ చేసుకుంటే వాయిస్ రికార్డర్ పై నొక్కితే కేవలం వాయిస్ మాత్రమే రికార్డు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో మోడ్ కు మారదు. అయితే ఈ కొత్త ఫీచర్ కేవలం కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు టెస్ట్ ఫ్లైట్ యాప్ నుంచి ఈ బీటా వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.