Telegram APP : టెలిగ్రామ్ ప్రీమియం వర్షన్.. ఫీచర్ల వర్షం!!

పెయిడ్‌. నెలకు దాదాపు రూ.390 కట్టాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 06:00 PM IST

పెయిడ్‌. నెలకు దాదాపు రూ.390 కట్టాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. టెలిగ్రామ్ ప్రీమియం యాప్ ఇప్పుడు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. మన ఇండియాలో ఐవోఎస్ యాప్ వెర్షన్ 8.8లో భాగంగా అప్‌డేట్ వచ్చింది. టెలిగ్రామ్ యాప్ ను అప్ డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ వచ్చి చేరుతాయి. పూర్తి స్థాయిలో అవి అందాలంటే మాత్రం డబ్బులు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.వాస్తవానికి టెలిగ్రామ్ అధికారికంగా ఇంకా ప్రీమియం ప్యాకేజీ ప్లాన్‌లను ప్రకటించలేదు.

కొత్త ఫీచర్లు ఇవే..

* టెలిగ్రామ్ ప్రీమియం వినియోగదారులు 4GB ఫైల్‌లను సెండ్‌ చేసుకోవచ్చు.
* 4 గంటలు నిడివి ఉన్న 1080p వీడియో లేదా 18 రోజులపాటు కంటిన్యూగా వినే హై క్వాలిటీ ఆడియో ఫైల్‌ను సెండ్‌ చేయొచ్చు.
* వేగవంతమైన డౌన్‌లోడ్‌లు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు పొందొచ్చు.
* 1000 ఛానెల్‌లను ఫాలో కావచ్చు.
* ఒక్కొక్కటి 200 చాట్‌లతో గరిష్టంగా 20 చాట్ ఫోల్డర్‌లను సృష్టించవచ్చు.
* ఏదైనా టెలిగ్రామ్ యాప్‌కి నాలుగో ఖాతాను జోడించవచ్చు,
* ప్రధాన జాబితాలో 10 చాట్‌లను పిన్ చేయవచ్చు.
* 10 ఇష్టమైన స్టిక్కర్‌లను సేవ్ చేయవచ్చు.
* లింక్‌తో సుదీర్ఘమైన బయోని జత చేయవచ్చు. మీడియా శీర్షికలకు మరిన్ని అక్షరాలను జోడించవచ్చు.
* గరిష్టంగా 400 ఇష్టమైన GIFలకు యాక్సెస్‌ పొందే అవకాశం ఉంటుంది.
* ప్రీమియం వినియోగదారులు 20 పబ్లిక్ t.me లింక్‌లను కూడా రిజర్వ్ చేసుకోవచ్చు.
* వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చుకునే అవకాశం ఉంది.
* వివిధ రకాల ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి వీలుగా డజన్ల కొద్దీ టెలిగ్రామ్ స్టిక్కర్‌లు ఫుల్-స్క్రీన్ యానిమేషన్‌లతో అందుబాటులో ఉంటాయి.
* ప్రీమియం వినియోగదారుల కోసం స్టిక్కర్ కలెక్షన్‌కు ప్రతి నెలా కొత్తవి యాడ్‌ కానున్నాయి.
* ప్రీమియం వినియోగదారుల కోసం 10కి పైగా కొత్త ఎమోజీలను అందుబాటులోకి తెచ్చారు.
* చాట్‌ లిస్ట్ నుంచి డిఫాల్ట్ చాట్ ఫోల్డర్‌ను మార్చడం వంటి కొత్త ఫీచర్‌లను ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు పొందుతారు.
* ప్రీమియం యానిమేటెడ్ ప్రొఫైల్ పిక్చర్స్‌, ప్రీమియం బ్యాడ్జ్‌లు ఉంటాయి .ప్రీమియం బ్యాడ్జ్‌లు చాట్ లిస్ట్, చాట్ హెడర్‌లు, గ్రూప్‌లలోని సభ్యుల జాబితాలలో వారి పేరు పక్కన కనిపిస్తుంది.
* ప్రీమియం సబ్‌స్క్రైబర్‌ల ప్రొఫైల్ వీడియోలు చాట్‌లు, చాట్ లిస్ట్‌తో సహా యాప్ అంతటా అందరికీ యానిమేట్ అవుతాయి.
* ప్రీమియం వినియోగదారులు తమ హోమ్ స్క్రీన్‌లకు జోడించగల కొత్త చిహ్నాలను పొందుతారు. ప్రీమియం స్టార్, నైట్ స్కై లేదా టర్బో-ప్లేన్ వంటి ఆప్షన్లు ఉంటాయి.
* ప్రీమియం వెర్షన్‌ లో కస్టమర్‌లకు యాడ్స్‌ కనిపించవు.