Whatsapp: అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయా.. అయితే వెంటనే అలా చేయండి?

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చాలామంది వాట్సాప్ వినియోగదారులకు అంతర్జాతీయ ఫోన్ కాల్స్ వేధిస్తున్నాయి. ముఖ్యంగా మలేషియా, కెన్యా, ఇతియోఫియా,

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 07:00 PM IST

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చాలామంది వాట్సాప్ వినియోగదారులకు అంతర్జాతీయ ఫోన్ కాల్స్ వేధిస్తున్నాయి. ముఖ్యంగా మలేషియా, కెన్యా, ఇతియోఫియా, వియత్నం వంటి ఐ ఎస్ డి కోడ్ లు కలిగిన నెంబర్ లతో ఈ ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని ఆడియో కాల్స్ మరికొన్ని వీడియో కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయి వారి ఉద్దేశం ఏమిటి? ఆ వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా చాలామంది ఈ విషయంపై వాట్సాప్ కి రిపోర్ట్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో ఈ విషయంపై వాట్సాప్ సంస్థ తొలిసారిగా స్పందించింది..

అయితే ఇటువంటి కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే సదరు నంబర్‌ను బ్లాక్‌ చేసి రిపోర్ట్‌ చేయాలని వినియోగదారులకు వాట్సాప్‌ సంస్థ సూచించింది. రిపోర్ట్‌ చేసిన వెంటనే ఆ నంబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశ విదేశాల నుంచి ఏవైనా అనుమానాస్పద కాల్స్‌, సందేశాలు వచ్చినప్పుడు రిపోర్ట్‌ చేయాలని యూజర్లకు సూచించింది. అలాగే వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ప్రైవసీ కంట్రోల్‌లోకి వెళ్లి కాంటాక్టుల్లోని వ్యక్తులకు మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మోసాల నుంచి రక్షణ కోసం ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది వాట్సాప్ సంస్థ.

కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… సాధారణంగా ఇంటర్నేషనల్‌ కాల్స్‌ చేసే వారు ఫేక్‌ జాబ్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు యూట్యూబ్‌ వీడియోలకు లైక్‌ కొట్టండి వీడియోకు ఇంత మొత్తం చెల్లిస్తామని ఆఫర్‌ చేస్తారు. తర్వాత ఎక్కువ మొత్తంలో చెల్లిస్తామని ఆశ చూపి పెద్ద మొత్తంలో దోచే ప్రమాదం ఉంది. మరికొందరు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అనుమానాస్పద కాల్స్‌ లిఫ్ట్‌ చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఈ తరహా కాల్స్‌ వస్తే వెంటనే.ఆ నంబర్‌పై క్లిక్‌ చేసి త్రీ డాట్స్‌ మెనూలోకి వెళ్లి బ్లాక్‌ చేయాలని సూచిస్తున్నారు. ఒకసారి బ్లాక్‌ చేసిన నంబర్‌ నుంచి ఎలాంటి కాల్స్‌, మెసేజ్‌లు రావు.