Site icon HashtagU Telugu

WhatsApp: మరో సరికొత్త ఫీచర్ తో అదరగొడుతున్న వాట్సాప్.. ఫీచర్స్ ఇవే?

Whatsapp

Whatsapp

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో కొత్త ఫీచర్ల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం.. కాగా వాట్సాప్ సంస్థ తాజాగా ఐఫోన్‌ యూజర్లకు గ్రూప్‌ కాల్‌ షెడ్యూల్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా స్టేటస్‌ ట్యాబ్‌లో న్యూస్‌ లెటర్స్‌ ఆప్షన్‌ ను అందిస్తోంది. దీని ద్వారా కూడా భవిష్యత్తులో యూజర్లు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo నివేదిక మేరకు.. ప్రైవేట్ న్యూస్‌లెటర్ టూల్‌ ద్వారా వినియోగదారులు, ఎవరి అప్‌డేట్స్‌ తెలుసుకోవాలో సెలక్ట్‌ చేసుకోవచ్చు. తమకు నచ్చిన బ్రాడ్‌ కాస్టర్స్‌నే ఫాలో అవ్వచ్చు. ఈ ఫీచర్ స్టేటస్‌ ట్యాబ్‌లో విడిగా, ఆప్షనల్‌గా వస్తుంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ ప్లాట్‌ఫారం స్టేటస్‌ ట్యాబ్‌ను రీడిజైన్‌ చేస్తోంది. ఇందులో ఇప్పుడు స్టేటస్‌, న్యూస్‌లెటర్‌ అనే సెక్షన్‌లను అందించనుంది. నేరుగా స్టేటస్ ట్యాబ్‌లో న్యూస్‌లెటర్‌ ఇంటిగ్రేట్‌ చేయడం కీలక అప్‌డేట్‌. ఈ మార్పులు భవిష్యత్తు అప్‌డేట్‌లలో యూజర్లకు అందనున్నాయి. యూజర్‌నేమ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా కూడా వాట్సాప్‌ యూజర్లు న్యూస్‌లెటర్‌ అప్‌డేట్స్‌ యాక్సెస్‌ చేయవచ్చు.

ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకదాని తర్వాత మరొక స్టేటస్‌ కనిపిస్తాయి. ఇకపై భవిష్యత్తులో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల మాదిరిగా హారిజాంటల్‌ లేఅవుట్‌లో కనిపించేలా వాట్సాప్‌ ఛేంజెస్‌ తీసుకురానుంది. అదే విధంగా న్యూస్‌లెటర్‌ క్రియేట్‌ చేసే, సబ్‌స్క్రైబ్‌ చేసుకునే యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు వారి ఫోన్ నంబర్‌లను మాస్క్ చేసి ఉంచుతారని WABetaInfo నివేదిక పేర్కొంది. ఈ న్యూస్‌లెటర్స్‌కు ప్రస్తుతం ఎటువంటి ఆల్గారిథమ్‌ సిస్టం లేదు. అలాగే ఎటువంటి యాడ్స్‌ కూడా లేవు. క్రోనోలాజికల్‌ ఆర్డర్‌ ప్రకారం కనిపిస్తాయి. వాటిపై యూజర్లకు పూర్తి కంట్రోల్‌ ఉంటుంది. తాము ఎవరిని ఫాలో అవుతున్నారో, ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇదంతా డెవలప్‌మెంట్‌ స్టేట్‌లో ఉండగా భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది.