Site icon HashtagU Telugu

WhatsApp Blue Badge: వాట్సాప్ లో ఇది గమనించారా.. మారిన వెరిఫికేషన్ బ్యాడ్జ్ కలర్!

Whatsapp Blue Badge

Whatsapp Blue Badge

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే పదుల సంఖ్యలో ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ లో మరో కొత్త మార్పు తీసుకొచ్చింది. గో-టు-మెసెంజర్ అప్లికేషన్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తోంది.

వెరిఫైడ్ బిజినెస్,ఛానెల్‌ల కోసం ఇప్పటికే ఉన్న గ్రీన్ బ్యాడ్జ్‌ని బ్లూ చెక్‌మార్క్‌తో భర్తీ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ తో సహా అన్ని సొంత ప్లాట్‌ఫారమ్‌ లలో వెరిఫైడ్ అకౌంట్ల కోసం స్టేబుల్ వ్యూ ఐడెంటిటీని క్రియేట్ చేస్తోంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌ లో ఇప్పటికే ఉన్నట్టుగా కొత్త చెక్‌మార్క్‌ తో ప్రయోగాలు చేయడానికి వాట్సాప్ ఇప్పుడు ఐఓఎస్ యూజర్లకు అదే అవకాశాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మెటా వ్యాపారాలు, ఛానెల్‌లను వెరిఫై చేయడానికి వాట్సాప్ బ్లూ కలర్ చెక్‌మార్క్‌ కు మారింది. ఈ అప్‌డేట్ పాత గ్రీన్ బ్యాడ్జ్‌ స్థానంలో వచ్చింది. మెటా ప్లాట్‌ఫారమ్‌ల అంతటా సమన్వయ రూపాన్ని క్రియేట్ చేస్తుంది. వినియోగదారులలో మరింత విశ్వాసాన్ని బలపరుస్తుంది.

బ్లూ చెక్‌మార్క్ అకౌంట్ ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు మోసాల నుంచి వినియోగదారులను రక్షిస్తుంది. వెరిఫైడ్ బిజిసెన్, ఛానెల్‌లతో సేఫ్ ఎంగేజ్ అయ్యేందుకు వీలు ఉంటుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు వెరిఫైడ్ అకౌంట్లను సులభంగా గుర్తించవచ్చ. ఈ ఏకీకృత విధానం బ్రాండ్ ఐడెంటిటీని మరింత పెంచుతుంది. వినియోగదారులు ప్రామాణికమైన అకౌంట్లను గుర్తించవచ్చు. ప్రస్తుతానికి టెస్ట్ ఫ్లయిట్ యాప్ నుంచి ఐఓఎస్ కోసం వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌లను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది యూజర్లకుఈ ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.