Whatsapp Polls Feature: సరికొత్త అప్డేట్.. వాట్సాప్ లో పోల్స్ ఫీచర్?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం

  • Written By:
  • Updated On - November 17, 2022 / 05:05 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత వారం వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ని రిలీజ్ చేసిన మెటా ప్రస్తుతం మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని తీసుకురానుంది. వాట్సాప్ గ్రూపులలో పోల్స్ ఫీచర్ ని పరిచయం చేసింది. ఏదైనా అంశంపై గ్రూపులో పోల్ నిర్వహించడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వాట్సాప్ వినియోగదారులు వారి వాట్సాప్ ను అప్డేట్ చేసి గ్రూప్స్ లో పోల్స్ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పోల్స్ ఫీచర్ కేవలం వాట్సాప్ గ్రూప్స్ లో మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంది.

ఈ వాట్సాప్ లో పోల్స్ ఫీచర్ ని గ్రూప్ లో ఉండే సభ్యులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ అడ్మిషన్లకు మాత్రమే ఈ ఫిచర్ కాదు. ఫీచర్ ను గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక అంశంపై గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పోల్ క్రియేట్ చేస్తే 12 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు వాట్సాప్ యూజర్స్ వారికి నచ్చిన ఆప్షను సెట్ చేసుకోవచ్చు. అయితే గ్రూపులో పోల్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ మెంబర్స్ వారికి నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తారు. ఆ పోల్స్ లి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది వెంటనే తెలిసిపోతుంది. వాట్సాప్ లో పోల్స్ ఏవిధంగా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ముందుగా వాట్సాప్ లో గ్రూప్ ఓపెన్ చేసి అటాచ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పోల్ పైన క్లిక్ చేయాలి. క్వశ్చన్స్ లో మీరు అడగాలి అనుకుంటున్నా ప్రశ్న ఏదైనా టైప్ చేయవచ్చు. ఆ తర్వాత ఆప్షన్స్ లో మీరు ఇవ్వాలి అనుకుంటున్నా ఆప్షన్స్ ను టైప్ చేసుకోవచ్చు. ఆప్షన్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు గ్రూప్ లో పోల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత గ్రూప్లో ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు అన్నది కూడా తెలుసుకోవచ్చు.