ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్స్ లో ఎక్కువ శాతం మంది ప్రతిరోజూ వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ ని నిత్యం కోట్లాదిమంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగానే వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం వాట్సాప్ ను ఒకటికి మంచి డివైజ్ లలో యూజ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఫోన్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగిస్తూ.. ల్యాప్‌ట్యాబ్ వంటి వాటిని సెకండరీ డివైజ్‌లుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది ఒక సమస్య ఎదుర్కొంటుంటారు. సాధారణంగా వాట్సప్‌లోని చాట్‌లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే కాంటాక్ట్ ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచరను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఇకపై కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా అవకాశాన్ని తీసుకొస్తున్నారు.
కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో వాట్సాప్ యాడ్ చేయాలా? మొబైల్‌లోనూ యాడ్ చేయాలా? అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే మీరు ఈ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని సెలక్ట్ చేసుకొని నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్ పోయినా, మొబైల్ మార్చినా వాట్సాప్ లో సేవ్ అయిన నెంబర్స్ అలాగే ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా మళ్లీ నెంబర్స్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదట. ఇక వాట్సాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పర్సనల్ అసిస్టెంట్‌కు కొత్తగా చాట్ మెమొరీ ఫీచర్ ను యాడ్ చేయనున్నారు. దీంతో మీకు సంబంధించిన విషయాలను అది సేవ్ చేసుకొని మీకు సంబంధించిన వివరాలన అందిస్తాయి ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పనిచేస్తున్నారు.